
ఇక అదే తర్వాత స్నేహంగా మారింది. “నిన్ను చూసే నేను కూడా హీరో అవ్వాలి అని డిసైడ్ అయ్యా” అంటూ నాగ్‌ని పొగడటంతో స్టూడియోలో హంగామా జరిగింది. అంతే కాదు, జగ్గూ భాయ్ ఒక స్ట్రైట్ ప్రశ్న కూడా వేశారు – “నువ్వు ఎందుకు కూలీ సినిమాలో విలన్ పాత్ర చేసావు?” అని. దానికి నాగార్జున ఇచ్చిన సమాధానం మాత్రం షాకింగ్. “ఒకడు పుట్టగానే ఎవరి చేతిలో చావాలి అనేది వాడి నుదుటిపైనే రాసి ఉంటుంది” అంటూ నాగ్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే, అఖిల్ సినిమా గురించి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ హైలైట్‌గా మారింది. అఖిల్ తాజా మూవీ కోసం జగపతిబాబుని ఒక చిన్న పాత్రకు అడిగారట. కానీ నాగార్జున ఆ ప్రపోజల్‌నే రద్దు చేశారట. కారణం ఏమిటంటే – “నా ఫ్రెండ్ అయిన జగపతిబాబు చిన్న పాత్రలో కనిపించడం నాకు ఇష్టం లేదు. ఆయనకు ఆ స్థాయి అవసరం లేదు” అని నాగ్ చెప్పడంతో, జగ్గూ భాయ్ కూడా ఎమోషనల్ అయ్యారు.
వెంటనే “మీరు చేసిన పని నిజంగా మీ ఎథిక్స్‌నే చూపిస్తుంది. ఐ లవ్ యువర్ ఎథిక్స్” అంటూ నాగ్‌కి థాంక్స్ చెప్పారు. ఈ మాటలన్నీ విన్న నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. ఫ్రెండ్షిప్‌కి రియల్ ఎగ్జాంపుల్ అంటే ఇదే అని కామెంట్లు చేస్తున్నారు. షోలో నాగ్ ఇచ్చిన ఎమోషనల్ ఆన్సర్స్, జగ్గూ భాయ్ వేసిన మాస్సీ క్వశ్చన్స్… ఇవన్నీ కలిపి “జయమ్ము నిశ్చయమ్మురా” మొదటి ఎపిసోడ్‌నే బ్లాక్‌బస్టర్ హిట్ చేయబోతున్నాయి. ఇప్పటికే ఈ వీడియోలు వైరల్ అవుతుండటంతో, షోకు మరింత బజ్ వచ్చింది. జగపతిబాబు హోస్ట్‌గా ఓవర్ ఆల్ ఎనర్జీ చూపిస్తుంటే, నాగార్జున గెస్ట్‌గా తన సింపుల్ కానీ హృదయానికి హత్తుకునే మాటలతో ఆకట్టుకున్నారు. అఖిల్ విషయంలో నాగ్ తీసుకున్న స్టాండ్, జగపతిబాబు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో రుజువు చేస్తోంది. మొత్తానికి టాలీవుడ్ టాప్ ఫ్రెండ్స్‌కి స్క్రీన్ మీద ఈ లవ్ అండ్ రిస్పెక్ట్ సీన్స్ ఫ్యాన్స్‌ను మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నాయి.