సినీ సెలబ్రిటీల పేరుతో గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చాలా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వారి అభిమానుల నుంచి ప్రజల నుంచి ఏదో ఒక రూపంతో డబ్బులు కాజేయాలని చూస్తూ ఉన్నారు కేటుగాళ్లు. దీనివల్ల సినీ సెలబ్రిటీలు కూడా ఫేక్ అకౌంట్స్ బారిన పడుతున్నారు. అలా ఇప్పటికీ ఎంతోమంది సినీ స్టార్స్ ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందిస్తూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా మహేష్ బాబు కూతురు సీతార కు కూడా అలాంటి అనుభవమే ఎదురైనట్టుగా తెలియజేసింది.


దీనిపైన సోషల్ మీడియాలో క్లారిటీ ఇస్తు తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ షేర్ చేసింది సితార.. తన పేరు మీద పలు ఫేక్ అకౌంట్లో ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ చెబుతున్నాను నాకు ఇంస్టాగ్రామ్ లో మాత్రమే అకౌంటు ఉన్నది. అదే నా అఫీషియల్ అకౌంట్ ఏదైనా చెప్పాలి అనుకుంటే ఆ అకౌంట్ ద్వారానే తాను చెబుతానని మరే సోషల్ మీడియా ఖాతా తనకి లేదని తెలియజేసింది సితార. కాబట్టి తన పేరు మీద అకౌంట్స్ మెయింటెయిన్ చేస్తున్న వారందరితో జాగ్రత్తగా ఉండండి అంటూ తెలియజేసింది.


ఎవరు కూడా ఎలాంటి ఫేక్ వీడియోలను, మెసేజ్లను నమ్మవద్దు అంటూ రాసుకుంది సితార. సితార చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్ రేంజిలో పాపులారిటీ సంపాదించుకున్నది. ముఖ్యంగా తాను సంపాదిస్తున్న వాటిలో చాలావరకు ట్రస్టుకే అందిస్తు పేద పిల్లల సహాయం కోసం పంపిస్తూ ఉంటుంది సితార. గతంలో కూడా ఒక జ్యూవెలరీ యాడ్ లో కనిపించింది సితార. ఇక అప్పటినుంచి నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ తనకు తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ మరింత ఫాలోవర్స్ ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్ అయితే వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: