
తాజాగా సికిందర్ సినిమా ఫలితం పైన డైరెక్టర్ మురగదాస్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో మురగదాస్ మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ తో సినిమా చేయడం చాలా కష్టమని వెల్లడించారు. స్టార్ హీరోతో సినిమా చేయడం అంటే అంత సులువైన విషయం కాదు పగలు తీయాల్సిన సన్నివేశాలు చాలా ఉంటాయి. ఆయన రాత్రి 8 గంటలకు సినిమా షూటింగ్ సెట్స్ కి వస్తే రాత్రి 2 గంటల వరకు సినిమా షూటింగ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్లే మేమంతా తెల్లవారుజామున షూటింగ్ చేయడానికి అలవాటు పడిపోయాము కానీ అక్కడ పరిస్థితులు మొత్తం అలా ఉండేవి కావు అంటూ తెలిపారు.
అందుకు ఉదాహరణ ఒక సన్నివేశంలో నలుగురు పిల్లలు ఉంటే వారు స్కూల్ నుంచి తిరిగి వస్తున్న సన్నివేశం చేయాలి.. ఆ చేసే సన్నివేశం సాయంత్రం సమయంలో తీయాలి.. ఆ స్టార్ హీరో వల్ల వేకువజామున 2 గంటల సమయాలలో షూటింగ్ చేయవలసి వచ్చింది. ఆ సమయంలో ఆ పిల్లలు నిద్రపోతారు కదా? అలా చేయడం చాలా కష్టమయ్యేది అంటూ తెలియజేశారు మురగదాస్. ఈ విషయం చెప్పిన తర్వాత చాలామంది నేటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు సల్మాన్ ఖాన్ కి రాత్రి సమయాలలోనే ఎందుకు షూటింగ్లో పాల్గొంటున్నారు అనే ఆలోచనను నెటిజన్స్ సైతం చర్చించుకుంటున్నారు.