
ఎన్టీఆర్‌కు మద్దతుగా అనుదీప్ :
"నేను సపోర్ట్ చేస్తున్నాను. సినిమా మనల్ని ఏకం చేస్తుంది. సినిమా కోసం చాలామంది కష్టపడతారు. అది ఒక కుటుంబంలా ఉంటుంది. కానీ రాజకీయాలు మనల్ని విభజిస్తాయి. రెండింటిని వేరువేరుగా చూద్దాం. సినిమా వేరు, రాజకీయాలు వేరు. ఈ రోజు ఎన్టీఆర్‌ను టార్గెట్ చేస్తే, రేపు ఆ పరిస్ధితి మనకు రాదా ..? ఇతర స్టార్స్‌కి జరగవచ్చు. సైలెంట్‌గా ఉంటే ఈ సమస్యలు పెరుగుతాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కలిసికట్టుగా నిలబడి మన ప్రియమైన ఎన్టీఆర్‌కు మద్దతు ఇవ్వాలి. అందరూ కలిసి రండి.. ఎన్టీఆర్‌కు న్యాయం చేద్దాం."అంటూ #StandWithNTR అనే హ్యాష్‌ట్యాగ్‌ను సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి తెచ్చారు.
దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా అనుదీప్ పేరు చర్చనీయాంశమైంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన పేరును బాగా ట్రెండ్ చేస్తున్నారు. "ఎన్టీఆర్ బిగ్ ఫ్యాన్ అనుదీప్" అంటూ కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి.కాగా, మొదటి నుంచి జూనియర్ ఎన్టీఆర్‌కు రాజకీయాలంటే ఇష్టం లేదు. కానీ కావాలనే కొంతమంది ఆయనను టార్గెట్ చేస్తూ, రాజకీయ పరంగా ట్రోలింగ్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మిగతావాళ్లను అధిగమిస్తారనే భయమా? లేక కావాలని ఆయనను వ్యక్తిగతంగా టార్చర్ చేయడానికా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తాజాగా ‘వార్ 2’ సినిమాను అడ్డుకోవాలన్న ఉద్దేశ్యంతో, దాన్ని ఎవరూ చూడకూడదని, పచ్చి బూతులతో ఒక టిడిపి ఎమ్మెల్యే మాట్లాడిన ఆడియో బయటకు రావడంతో, సినీ ఇండస్ట్రీని మాత్రమే కాదు, రాజకీయ వర్గాలను కూడా షేక్ చేసి వేసింది.
