తెలుగు సంగీత ప్రపంచంలో రాహుల్ సిప్లిగంజ్ పేరు చెప్పగానే యువత నుంచి పెద్దల వరకూ అందరికీ బాగా తెలిసిన సింగర్ అని చెప్పాలి. రాహుల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి పలు సినిమాలకు పాటలు పాడినప్పటికీ, ఆయన కెరీర్‌లో నిజమైన టర్నింగ్ పాయింట్ బిగ్ బాస్ సీజన్ గెలుపు. బిగ్ బాస్ ట్రోఫీని గెలుచుకున్న తర్వాతే ఆయన పేరు ఇండస్ట్రీలో బాగా హైలైట్ అయ్యింది. తరువాత వరుసగా పలు  సినిమాలలో పాటలు పాడే అవకాశం దక్కించుకున్న రాహుల్, తన ప్రత్యేకమైన వాయిస్‌తో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే, ఆయన స్టార్‌డమ్‌ను మరింత పెంచిన అసలు ఘట్టం రాజమౌళి దర్శకత్వం వహించిన "ఆర్ఆర్ఆర్" సినిమా. ఈ సినిమాలో పాడిన "నాటు నాటు " పాట ఒక్క రాహుల్‌కే కాకుండా భారతీయ సినీ పరిశ్రమకు గర్వకారణమైంది. ఈ పాటకు ఆస్కార్  అవార్డు రావడంతో రాహుల్ సిప్లిగంజ్ పేరు గ్లోబల్ లెవెల్‌లో ట్రెండ్ అయ్యింది. రాహుల్ ఊహించని రేంజ్‌లో పాపులారిటీ దక్కించుకొని ఓవర్నైట్ స్టార్‌గా మారిపోయాడు.


ఈ విజయాల తర్వాత రాహుల్ పేరు పరిశ్రమలోనే కాదు, రాజకీయ, సామాజిక వర్గాలలోనూ బాగా హైలైట్ అయ్యింది. ఎంతోమంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. అయితే, అభిమానులకు ఊహించని షాక్ ఇస్తూ రాహుల్ తన ప్రేయసి హరిణ్యా రెడ్డితో ఆగస్టు 17న నిశ్చితార్థం చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమకథ గురించి ఎవరూ ఊహించకపోవడం, ఎలాంటి రూమర్స్ బయటకు రాకపోవడం గమనార్హం. చాలా సీక్రెట్‌గా లవ్ స్టోరీని మెయింటైన్ చేసిన వీళ్ళిద్దరూ నిశ్చితార్థం వార్తతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. సినీ సెలబ్రిటీలు, సన్నిహితులు ఈ వేడుకకు హాజరై కొత్త జంటకు ఆశీర్వాదాలు అందించారు. ఆ ఎంగేజ్మెంట్ పిక్చర్స్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెట్టింట ట్రెండింగ్ అయ్యాయి.



కానీ, నిశ్చితార్థం అయిన నాలుగు రోజులకే రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియో మళ్లీ చర్చనీయాంశంగా మారింది. రాహుల్ సిప్లిగంజ్ కన్యాకుమారి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. "ఇంత పెద్ద స్టార్ కూడా ఇలాంటి జాతకం, పూజలు నమ్ముతాడా?" అని కొందరు ఆశ్చర్యపోతే, "ఏమైనా జాతకాల్లో దోషాలు ఉన్నాయా? అందుకే ఇలా ప్రత్యేక పూజలు చేస్తున్నారా?" అంటూ మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక రాహుల్–హరిన్యా రెడ్డి లవ్ స్టోరీ ఎలా మొదలైంది? వీరిద్దరిని కలిపిన ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు? వీరి పరిచయం ఏ విధంగా ఏర్పడింది? అన్న ప్రశ్నలు ఇప్పుడు అభిమానుల్లో, సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఏది ఏమైనా, బిగ్ బాస్ విన్నర్‌గా మొదలైన రాహుల్ సిప్లిగంజ్ స్టార్‌డమ్, నాటు నాటుతో గ్లోబల్ ఫేమ్ దక్కించుకున్న ప్రయాణం, ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కొత్త అడుగు వేస్తూ హరిన్యా రెడ్డి‌తో నిశ్చితార్థం జరుపుకోవడం— రాహుల్ లైఫ్ స్టోరీని మరింత స్పెషల్‌గా మార్చాయి అని చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: