భారతీయ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న స్థానం ఎవరికీ దక్కలేదు. కేవలం నటన మాత్రమే కాదు, డ్యాన్స్‌లోనూ ఆయన రికార్డులు సృష్టించారు. 150కి పైగా సినిమాలు చేసిన చిరంజీవి కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్‌బస్టర్లు, కల్ట్ మూవీస్ ఎన్నో ఉన్నాయి. రాజకీయాల కారణంగా కొంత గ్యాప్ తీసుకున్నా, ఖైదీ నంబర్ 150తో మళ్లీ రికార్డులు వ్రాసుకున్నారు. ఆ తర్వాత సైరా, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలతో తిరిగి పుంజుకున్నారు. ప్రస్తుతం కూడా మెగాస్టార్ చేతిలో విశ్వంభర, మన శంకర వరప్రసాద్, శ్రీకాంత్ ఓదెల, బాబీ దర్శకత్వ ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి.


అయితే ప్రతి స్టార్ హీరోలాగే చిరంజీవి కెరీర్‌లోనూ మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్టులు, రిజెక్ట్ చేసిన కథలు అనేకం ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ, సింగీతం శ్రీనివాసరావు, సురేష్ కృష్ణ లాంటి లెజెండరీ డైరెక్టర్లతో సెట్స్ పైకి రాకముందే ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి. అలాగే చిరంజీవి వద్దన్న కథలను ఇతర హీరోలు చేసి బ్లాక్‌బస్టర్లు కొట్టిన సందర్భాలూ ఉన్నాయి. కానీ కొన్నిసార్లు మాత్రం బోల్తా కూడా పడ్డారు. అదే ఇలాగా ఒకసారి మెగాస్టార్ వద్దన్న కథను ఎన్టీఆర్ ఒప్పుకున్నారు. అది మరెవరో కాదు, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన “ఆంధ్రావాలా.” ఆంధ్రావాలా క్రేజ్ – ఆడియో ఫంక్షన్ హంగామా



2004లో వచ్చిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఆరంభం నుంచి భారీ క్రేజ్ క్రియేట్ చేసింది. ఆడియో ఫంక్షన్‌కి లక్షలాది అభిమానులు హాజరై రికార్డు క్రియేట్ చేశారు. అప్పట్లోనే కాదు, ఇప్పటికీ ఆ రికార్డు అలాగే కొనసాగుతోంది. ఎన్టీఆర్ ఇమేజ్, పూరి స్టైల్ – కలిపి “మాస్ సెన్సేషన్” అవుతుందని అందరూ నమ్మారు. మెగాస్టార్ వద్దన్న కథ – ఎన్టీఆర్ చేశాడు .. కానీ ఈ కథ మొదట పూరి జగన్నాథ్ చిరంజీవికే చెప్పారట. అయితే అప్పటికే మెగాస్టార్ షెడ్యూల్ బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌కి పెద్దగా ఆసక్తి చూపలేదట. దీంతో పూరి, తారక్ దగ్గరికి వెళ్లి కథ చెప్పి, ఎన్టీఆర్‌ని ఒప్పించారు. సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం పోషించారు.



డిజాస్టర్ అయినా.. పాటలు సక్సెస్ .. “ఆంధ్రావాలా” సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటినా, ఫలితం మాత్రం పూర్తిగా డిజాస్టర్. ఆడియెన్స్‌ను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే సినిమాలోని పాటలు మాత్రం హిట్ అయ్యి ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఇలా చిరంజీవి వద్దన్న కథను ఎన్టీఆర్ చేసినా, ఫలితం ఆశించిన విధంగా రాలేదు. ఒకరికి సక్సెస్ ఇస్తుందనుకున్న కథ.. మరొకరికి బోల్తా కొట్టించడం – ఇదే టాలీవుడ్ స్టార్ హీరోల కెరీర్‌లో జరిగే మాస్సీ మిస్టరీ!

మరింత సమాచారం తెలుసుకోండి: