నిన్న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన కొత్త మూవీ అప్డేట్స్ అలాగే ఆయన కమిట్ అయిన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ అయ్యాయి. అన్ని అప్డేట్స్ పట్ల అభిమానులు ఫుల్ ఖుషిగా ఉన్నారు. అయితే ఇప్పుడు అందరికీ ఒక బిగ్ కన్ఫ్యూషన్ స్టార్ట్ అయింది. మెగాస్టార్ చిరంజీవి–బాబీ దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేశారు. ఇది ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుంది? అసలు దీనికి ఆయన ఎలా టైం కేటాయిస్తారు? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే సందేహాలు ఎక్కువగా ఉన్నాయి.


ప్రస్తుతం చిరంజీవి - అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యి, ప్రమోషన్స్ మొత్తం పూర్తయ్యేసరికి సంక్రాంతి వస్తుంది. ఆల్రెడీ మూవీ మేకర్స్ ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత చిరంజీవి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నారని టాక్ వినిపించింది. అయితే ఆ సినిమా పరిస్థితి ఏమైందో తెలియదు. సడన్‌గా బాబీ లైన్‌లోకి వచ్చేసరికి ఈ ప్లాన్ మొత్తం మారిపోయిందా? అని కూడా మాట్లాడుకుంటున్నారు.



ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమా పూర్తయ్యాక చిరంజీవి ఏ సినిమాను ముందుకు తీసుకొస్తారు? శ్రీకాంత్ ఓదెల సినిమానా? లేక బాబీ దర్శకత్వమా? అనే విషయంలో అభిమానుల్లో చర్చ మొదలైంది. గతంలో భోళాశంకర్ రిలీజ్ అయిన తర్వాత కూడా చిరంజీవి వరుసగా సినిమాలు అనౌన్స్ చేసి, ఆర్డర్ మార్చిన సందర్భం ఉందని కొందరు గుర్తు చేస్తున్నారు. కొంతమంది మెగా హేటర్స్  టార్గెట్ చేస్తూ చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు. “ఇల్లు అలకగానే పండగ అయిపోదు… సినిమా అనౌన్స్ చేసినంత మాత్రాన వెంటనే అది ఫిక్స్ అయిపోయిన్నట్లు కాదు” అంటూ ఘాటు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం చిరంజీవి నుంచి రెండు సినిమాలపై క్లారిటీ ఉంది. ఒకటి విశ్వంభర, రెండవది సంక్రాంతికి వస్తున్నాం.. మన శంకర్  వరప్రసాద్ సినిమా. ఈ రెండు సినిమాల తర్వాత చిరంజీవి ఏ సినిమాను ముందుకు తీసుకొస్తారు? ఏ సినిమాను హోల్డ్‌లో పెడతారు? అనేది తెలియాల్సి ఉంది. అభిమానులు “చూద్దాం మరి ఏం జరుగుతుందో” అంటూ వెయిట్ చేస్తున్నారు..??

మరింత సమాచారం తెలుసుకోండి: