స్వర్గీయ నటసామ్రాట్ అల్లురామలింగయ్య గారి సతీమణి, బన్నీకి నానమ్మ, రామ్‌చరణ్‌కు అమ్మమ్మ, చిరంజీవి అత్తయ్య, అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నం గారు కన్నుమూయడం మెగా – అల్లు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపేసింది. 94 ఏళ్ల వయసులో సంపూర్ణ జీవితం గడిపిన కనకరత్నం గారు తన బిడ్డలతో పాటు మునిమనవళ్ల వరకూ చూసి ఆ భాగ్యం పొందారు. నిన్న‌ చివరి చూపు కార్యక్రమం అల్లు అర్జున్ నివాసంలో జరగగా, అక్కడ చోటుచేసుకున్న దృశ్యాలు అభిమానులను కదిలించాయి. ముఖ్యంగా ఈ ఘట్టం మెగా – అల్లు కుటుంబాల మధ్య ఉన్నట్టుగా ప్రచారం చేసిన విభేదాలపై పెద్ద క్లారిటీ ఇచ్చింది.

వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి అక్కడికి చేరుకుని అన్ని దగ్గరుండి చూసుకోవడం అందరినీ కదిలించింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ – రామ్‌చరణ్ కలిసి కూర్చుని జరిగే కార్యక్రమాలపై సీరియస్‌గా మాట్లాడుకోవడం, మేనల్లుడు చరణ్‌ను అరవింద్ ఆప్యాయంగా హత్తుకోవడం అభిమానులకు హృద్యంగా అనిపించింది. అదే సమయంలో సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ లు కూడా హాజరై, కుటుంబ బంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. అంతే కాదు, పవన్ కళ్యాణ్ భార్య అన్నాతో బన్నీ భార్య స్నేహరెడ్డి ఆప్యాయంగా ముచ్చటించుకోవడం, ఒక సందర్భంలో రామ్‌చరణ్ చేయి పట్టుకుని బన్నీ ఏదో పనిలోకి తీసుకెళ్లడం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను కదిలిస్తున్నాయి.ఇది చూసి అభిమానుల్లో ఒకే మాట – “మెగా – అల్లు కుటుంబాల్లో విభేదాలే లేవు..!” అనడమే.

గతంలో రెండు కుటుంబాల మధ్య చల్లదనమైందని, రామ్‌చరణ్ – అల్లు అర్జున్ ఎప్పటికీ కలిసిరారని చాలా రూమర్స్ వచ్చాయి. కానీ కనకరత్నం గారి చావు సందర్భంలో అందరూ ఒక కుటుంబంలా నిలబడి కలిసి ఉండటం ఆ పుకార్లకు బిగ్ చెక్ పెట్టింది. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన డిమాండ్ మొదలైంది. ఫ్యాన్స్, “గతంలో అల్లు అరవింద్ ‘చరణ్ అర్జున్’ అనే కాంబినేషన్‌ ఫిల్మ్ చేయాలనుకున్నారు. ఇప్పుడు ఈ రెండు ఫ్యామిలీలు బంధాన్ని మరింత బలంగా చూపించేందుకు అదే కాంబో రీ-లాంచ్ చేస్తే బాగుంటుంది” అంటూ ట్రెండ్ చేస్తున్నారు. మొత్తానికి.. ఒక విషాదం రెండు కుటుంబాలను మరింత దగ్గర చేసి, అభిమానుల్లో నెలకొన్న అనుమానాలకు చరమగీతం పాడింది. ఇక మిగతా ఫ్యాన్స్ ఆశ మాత్రం – త్వరలో చరణ్ – బన్నీ కాంబో మూవీ చూడాలని..!

మరింత సమాచారం తెలుసుకోండి: