
లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్ ఇప్పటికే లాక్ అయ్యాయి. హైదరాబాద్‌లో జరిగే కీలక షెడ్యూల్‌లో బాలయ్యపై ఇంట్రడక్షన్ సీన్స్‌ను ఘనంగా తెరకెక్కించబోతున్నారని టాక్. ఈ ఇంట్రో సీన్స్ అభిమానులకు పండగ వాతావరణం తీసుకొస్తాయని సినీ టౌన్స్‌లో టాక్ నడుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఓ తమిళ స్టార్ హీరోను కూడా తీసుకురావాలని టీం యోచిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత క్రేజ్ పెరిగింది. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ఇటీవలే గోపీచంద్ మలినేని సోషల్ మీడియాలో స్పందిస్తూ గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్. ఈసారి మా గర్జన మరింత గట్టిగా వినిపించనుంది. బాలయ్యతో మళ్లీ పనిచేయడం గర్వకారణం. ఇది చరిత్రలో నిలిచే సినిమా అవుతుందని చెప్పారు. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో 111వ ప్రాజెక్ట్‌గా నిలవబోతోంది. మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు