టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో అత్యంత వేగంగా ఎదిగిన హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. తన నటన, డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ యువ హీరోయిన్‌.. పుట్టింది అమెరికాలో అయినప్పటికీ, చిన్న వయసులోనే ఆమె కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. తల్లి ఆకాంక్ష మేర‌కు ఓవైపు చ‌దువుకుంటూనే.. మ‌రోవైపు నృత్యం నేర్చుకుంది. ఆ త‌ర్వాతి కాలంలో గ్లామ‌ర్ ప్ర‌పంచం వైపు అడుగులు వేసింది. 2019లో `కిస్` అనే క‌న్న‌డ మూవీతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన శ్రీ‌లీల‌.. `పెళ్లి సందడి`తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయింది.


తొలి సినిమాతోనే టాలీవుడ్ లో విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకుంది. పెళ్లి సంద‌డి త‌ర్వాత శ్రీ‌లీల వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ ఆఫ‌ర్ల‌తో కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతోంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ఎక్కువ సినిమాల్లో గ్లామర్, డ్యాన్స్ డిపెండ్ రోల్స్ మాత్రమే రావడం వల్ల నటన పరంగా తనను నిరూపించుకునే అవకాశం రాలేదు. పెర్ఫార్మెన్స్ బేస్డ్ రోల్స్ కూడా వస్తే, సమంత, సాయి పల్లవి లాంటి రేంజ్‌ను సాధించడం శ్రీ‌లీల‌కు కష్టమేమీ కాదు.


ఇదిలా ఉంటే.. తాజాగా శ్రీలీల త‌న ఇన్‌స్టాలో చాట్ సెష‌న్ నిర్వ‌హించింది. అయితే అందులో ఓ ఫ్యాన్ చాలా బాధ‌లొ ఉన్నాన‌ని చెప్తూ మెసేజ్ చేయ‌గా.. శ్రీ‌లీల వెంట‌నే రియాక్ట్ అయింది. నేను మీకెంత‌ హెల్ప్ చేయ‌గ‌ల‌నో తెలీదు కానీ.. వెంట‌నే వెళ్లి మీ ఫ్యామిలీ మెంబ‌ర్ ను హ‌గ్ చేసుకోండి. నేను బాధ‌లో లేదా నిరుత్సాహంగా ఉంటే మొద‌ట అదే చేస్తా. అలాగే మ్యూజిక్ కూడా మూడ్ ను సెట్ చేయ‌డానికి మంచి థెర‌పీలాగా ప‌ని చేస్తుంది కాబ‌ట్టి మ్యూజిక్ వినండి అంటూ త‌న అభిమానికి శ్రీ‌లీల ప‌లు స‌ల‌హాలు ఇచ్చింది. దీంతో శ్రీ‌లీల రిప్లై హైలెట్‌గా నిలిచింది. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తూ.. ఈ నాటీ గ‌ర్ల్ ప్ర‌స్తుతం తెలుగులో `మాస్ జాత‌ర‌`, `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రాలు చేస్తోంది. త‌మిళంలో శివ కార్తికేయ‌న్ తో `పరాశక్తి`లో న‌టిస్తోంది. మ‌రోవైపు `ఆషికి 3`తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కూడా సిద్ధ‌మైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: