రామ్ చరణ్ ఏ పని చేసినా దానిని ముందుగా పూర్తిగా ఆలోచించి, జాగ్రత్తగా నిర్ణయించుకొని మాత్రమే చేస్తాడని సినీ ఇండస్ట్రీలో అందరికీ బాగా తెలుసు. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఉన్న ఆలోచనాత్మక దృష్టి, కృషి కారణంగానే రామ్ చరణ్ నటించిన సినిమాలు ఒక్కొక్కటిగా సూపర్ డూపర్ హిట్స్ అవుతూ, బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాలు సాధిస్తుంటాయి. ఆయన అభిమానులు కూడా ఈ విషయాన్ని గర్వంగా చెబుతారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో, ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై రామ్ చరణ్ గురించి ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా మారి ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం రామ్ చరణ్ తన కొత్త సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు సన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక భారీ బడ్జెట్ సినిమా కోసం ఆయన కష్టపడి పని చేస్తున్నారు. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను వేరే లెవెల్‌లో ఆకట్టుకుంటాయని, ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి ఉండబోతుందని మూవీ మేకర్స్ అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది.


ఇంతలోనే సోషల్ మీడియాలో రామ్ చరణ్ రాబోయే సినిమాలకు సంబంధించిన డైరెక్టర్ల లిస్ట్ వైరల్ అవుతోంది. ట్రెండింగ్ న్యూస్ ప్రకారం, రామ్ చరణ్ ప్రస్తుతం టాప్ మోస్ట్ బిజీ డైరెక్టర్లతో పలు ప్రాజెక్టులు లైన్‌లో పెట్టుకున్నాడు. బుచ్చిబాబు సన్న దర్శకత్వంలో సినిమా పూర్తి అయిన వెంటనే రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి కమిట్ అయ్యాడని సమాచారం. ఈ సినిమా కూడా కొత్త కాన్సెప్ట్‌తో, అద్భుతమైన టేకింగ్‌తో రామ్ చరణ్ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లబోతుందని అంటున్నారు. సుకుమార్ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్, సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించిన దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో ఓ యాక్షన్ ప్యాక్డ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడని టాక్. ఈ కాంబినేషన్ పైనే ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది. లోకేష్ కనకరాజ్ యాక్షన్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ను సృష్టించుకున్నాడు. ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్ ఎలా కనిపించబోతాడో అన్న ఆసక్తి ఇప్పటికే అభిమానుల్లో ఎక్కువైంది.



అంతటితో ఆగకుండా, రామ్ చరణ్ ,ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా మరో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. 'కేజీఎఫ్' సిరీస్, 'సలార్' వంటి సినిమాలతో పాన్ ఇండియా రేంజ్‌లో ఫ్యాన్ బేస్ పెంచుకున్న ప్రశాంత్ నీల్, రామ్ చరణ్‌తో చేసే సినిమా కూడా అదే స్థాయిలో భారీ అంచనాలను సృష్టిస్తోంది. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత, మాస్ ఆడియన్స్‌ను సెన్సేషనల్ యాక్షన్ కథలతో ఆకట్టుకున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రామ్ చరణ్ మరో పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే అభిమానులు ఓ రేంజ్‌లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా సినిమాలు ఎప్పుడూ ఇంటెన్స్ స్టోరీలు, పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్‌తో ఉంటాయి. అలాంటి డైరెక్టర్‌తో రామ్ చరణ్ కలిసి పనిచేస్తున్నాడని తెలిసి, ఈ సినిమా పైనే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.



ఇలా రామ్ చరణ్ వరుసగా ముగ్గురు టాప్ మోస్ట్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్లతో పని చేస్తున్నాడన్న విషయం అభిమానుల్లో మాత్రమే కాకుండా, ఇండస్ట్రీ అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలు ఒక్కొక్కటి బ్లాక్‌బస్టర్‌గా నిలిస్తే, రామ్ చరణ్ పాన్ ఇండియా స్థాయిలో మరింత పెద్ద క్రేజ్‌ను సంపాదించడమే కాకుండా, డబుల్ అవార్డులు సాధించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రామ్ చరణ్ కొత్త సినిమాల లిస్ట్, ఆయన వర్క్ చేస్తున్న డైరెక్టర్ల వివరాలు వైరల్ అవుతున్నాయి. అభిమానులు కూడా ఈ ప్రాజెక్టుల కోసం ఎదురుచూస్తూ, “ఈసారి రామ్ చరణ్ కెరీర్‌లోనే గోల్డెన్ ఇయర్ కానుంది” అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: