- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ యంగ్ హీరో తేజ స‌జ్జ హీరోగా కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని తెర‌కెక్కించిన ఫాంట‌సీ మూవీ మిరాయ్‌. రిలీజ్ ముందు నుంచే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్ గా రు. 27 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. ఈ సినిమా రెండు రోజుల‌కు రు. 55 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. అస‌లు తేజ స‌జ్జ లాంటి హీరో సినిమాకు రెండు రోజుల‌కే ఈ స్థాయిలో వ‌సూళ్లు రావ‌డంతో టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాలు షాక్ లో ఉన్నాయి. మిరాయ్ ఇండియా లోనే తొలి రోజు రు. 13 కోట్ల నెట్ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. రెండో రోజు అంత‌కు మించి రు. 14.5 కోట్ల నెట్ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. రెండో రోజు కూడా తెలుగు లోనే అత్య‌ధికంగా రు. 11.5 కోట్ల నెట్ రాబ‌ట్టింది. హిందీ లో రు. 2.8 కోట్లు రాబ‌ట్టింది.


ఏదేమైనా అటు బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కింధ‌పురి సినిమా పోటీగా ఉన్నా .. మ‌రోవైపు థియేట‌ర్ల‌లో లిటిల్ హార్ట్స్ సినిమా ఉన్నా కూడా మిరాయ్ విధ్వంసం చూస్తుంటే ఈ సినిమా ఓ రేంజ్ లో వ‌సూళ్లు కొల్ల‌గొట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. తేజ స‌జ్జా హీరోగా న‌టించిన ఈ సినిమాను టీజీ విశ్వ ప్ర‌సాద్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. సినిమా లాంగ్ ర‌న్ లో రు. 200 కోట్ల కు పైగా వ‌సూళ్లు రాబ‌డుతుంద‌ని అంచ‌నా ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: