మంచు లక్ష్మి 50 ఏళ్ల వయసులో తగ్గేదేలే అంటూ హాట్ హాట్ డ్రెస్సులు వేస్తూ అందర్నీ మైమరిపిస్తుంది. ముఖ్యంగా లేటు వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి సినిమాల్లోకి వచ్చిన కొత్తలో బాగానే ఉన్నప్పటికీ ఏజ్ పెరిగిన కొద్దీ పొట్టి పొట్టి బట్టలు వేస్తూ హాట్ డోస్ ని పెంచేస్తోంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ జర్నలిస్ట్ ఏజ్ పెరుగుతున్న కొద్ది మీకు ఈ బట్టలు అవసరమా అన్నట్లుగా మాట్లాడారు. అయితే జర్నలిస్టు మాటలకి మంచు లక్ష్మి ఏ విధంగా స్పందించింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.మంచు లక్ష్మి నటించిన తాజా మూవీ దక్ష ది డెడ్లీ కాన్పిరసీ.. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.ఇక ఇందులో జర్నలిస్ట్ మీ వయసు 50 ఏళ్లకు దగ్గర పడుతుంది. ఇలాంటి సమయంలో ఈ డ్రెస్సులు వేసుకోవడం మీకు అవసరమా అంటూ ప్రశ్నించారు.

ఇక జర్నలిస్టు మాటలతో చిర్రెత్తుకుపోయిన మంచు లక్ష్మి నన్ను ఈ ప్రశ్న అడగడానికి మీకు ఎంత ధైర్యం..ఇదే ప్రశ్న మహేష్ బాబుని అడగగలరా.. ఒక మగాడిని ఈ ప్రశ్న అడగండి.. వాళ్ళను అడగనప్పుడు మమ్మల్ని ఎందుకు అడుగుతారు. మహేష్ బాబుకు 50 ఏళ్లు..ఆయన డ్రెస్ విప్పుకొని తిరిగితే ఎందుకు అలా తిరుగుతున్నారని అడగండి.. వాళ్ళని అడగరు కానీ ఆడవాళ్లను ఇలాంటి ప్రశ్న ఎలా అడుగుతారండి.. మీరు అడిగే ప్రశ్నలను బట్టి ప్రజలు కూడా మమ్మల్ని అలాగే ప్రశ్నిస్తున్నారు. ఒక బాధ్యతాయుతమైన జర్నలిస్టు స్థానంలో ఉన్న మీరు ఇలాంటి ప్రశ్న అడగవచ్చా.. అలాగే ఇండస్ట్రీలో ఉండే సూపర్ స్టార్ వైఫ్ సౌత్ లో ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా రాణించింది.ఆ తర్వాత తన భర్తకు విడాకులు ఇచ్చేసాక నువ్వు మాకు వద్దు అని ఆమెను ఇండస్ట్రీ పక్కన పెట్టేసింది.

ఒకవేళ అదే స్టార్ హీరోకి విడాకులు వచ్చాయి కాబట్టి ఆయన్ని ఇండస్ట్రీ పక్కన పెట్టిందా.. పెట్టదు ఆడవారి విషయంలో ఒకలా మగవారి విషయంలో ఒకలా ఉంటుంది. ఇండస్ట్రీలో ఉండే మగవారిని ఆడవారి లాగా ప్రశ్నించే దమ్ము ధైర్యం ఉంటుందా..అస్సలు ఉండదు ఆడవాళ్లకు మాత్రమే అన్ని రెస్పాన్సిబులిటీస్ ఉంటాయి. మగవాళ్ళకు ఇవేవీ ఉండవు. కానీ ఆడవాళ్లు స్వేచ్ఛను వెతుక్కుంటూ వస్తే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటూ మంచు లక్ష్మి కాస్త ఎమోషనల్ గా మాట్లాడింది. ఇక మంచు లక్ష్మి మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారడంతో చాలామంది ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు.ఈ సమాజం అంతే ఆడవారిని ఒకలా.. మగవారిని మరోలా చూస్తుంది. అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే కూర్చున్న చోటే ఉంటాం. వాటన్నింటినీ పక్కనపెట్టి బయటికి వస్తేనే మనం అనుకున్నది సాధించగలం అంటూ మంచు లక్ష్మికి సపోర్ట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: