
20 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు కేరళ లో 92.90 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 15.07 కోట్లు , తమిళ నాడు ఏరియాలో 17.30 కోట్లు , కర్ణాటక లో 12.30 కోట్లు , ఆఫ్ ఇండియాలో 6.80 కోట్లు , ఓవర్సీస్ లో 110.85 కోట్ల కనెక్షన్లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 20 రోజుల్లో ఈ సినిమాకు 112.50 కోట్ల షేర్ ... 255.22 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 26 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 27 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటివరకు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 85.50 కోట్ల లాభాలు వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ తో పోలిస్తే భారీ స్థాయిలో లాభాలను అందుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.