ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా హైలైట్ అవుతున్న టాపిక్ ఏమిటంటే .. రష్మిక మందన్నా మరియు విజయ్ దేవరకొండ నిశ్చితార్థం. గత కొంతకాలంగా ఈ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందనే వార్తలు సోషల్ మీడియాలో ఎన్నోసార్లు వైరల్ అయ్యాయి. వీళ్లిద్దరూ కలిసి ట్రిప్‌కి వెళ్లడం, పబ్లిక్ ఈవెంట్స్‌లో ఒకరినొకరు సపోర్ట్ చేయడం, సోషల్ మీడియాలో లైక్స్ & కామెంట్స్ పెట్టుకోవడం వంటి విషయాలన్నీ అభిమానుల్లో సందేహాలు రేకెత్తించాయి. అయితే దసరా సందర్భంగా ఒక్కసారిగా “రష్మిక మందన – విజయ్ దేవరకొండ నిన్న ఉదయం సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు” అనే వార్త బయటకు రావడంతో.. ఇది టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ న్యూస్ ఎంత స్పీడ్‌గా వైరల్ అవుతోందో చూస్తే, నెటిజన్లు ఇది నిజమే అని నమ్మే పరిస్థితి వచ్చింది.


ముఖ్యంగా ఈ వార్తపై ఇప్పటివరకు రష్మిక గానీ, విజయ్ దేవరకొండ గానీ ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వకపోవడం మరింత సస్పెన్స్‌కి కారణమైంది. ఫలితంగా ఫ్యాన్స్‌లో కుతూహలం పెరిగిపోయింది. “వీళ్లిద్దరూ నిజంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారా?”, “ఎక్కడ జరిగింది?”, “ఎవరు అటెండ్ అయ్యారు?” అంటూ సోషల్ మీడియా అంతా చర్చలతో మోగిపోతోంది. ఇంతలోనే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది .. ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరైన ఒకే ఒక్క వ్యక్తి పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఆయన మరెవరో కాదు, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. ఈ వేడుక చాలా ప్రైవేట్‌గా, కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరిగిందట. ఎటువంటి బాహ్య వ్యక్తులు లేకుండా, పూర్తిగా ఫ్యామిలీ ఈవెంట్‌గా నిర్వహించారట.



అయితే అభిమానులు మాత్రం ఒక్కటే అంటున్నారు — “ఒకవేళ నిజంగా ఎంగేజ్మెంట్ జరిగిందంటే, ఆనంద్ దేవరకొండ కనీసం ఒక ఫోటో అయినా షేర్ చేస్తే బాగుండేది!” అని. ఎందుకంటే రష్మికవిజయ్ లకు సోషల్ మీడియాలో విపరీతమైన అభిమానులు ఉన్నారు.వారి ప్రేమ, కెమిస్ట్రీ, సినిమాల్లో కలయిక — ఇవన్నీ చూసి ఫ్యాన్స్ చాలా కాలంగా ఈ ఇద్దరూ నిజంగా ఒక్కటి అవ్వాలి అని ఆశపడ్డారు.



ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ వార్తలు వస్తుండటంతో, ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.“వీళ్లిద్దరూ ఒకటైతే ఎంత బాగుంటుంది!”, “నిశ్చితార్ధం ఫొటోస్ రావాలి!”, “వీళ్లిద్దరూ కలసి జీవితాన్ని ప్రారంభిస్తే ఫుల్ ఖుషీగా ఉంటుంది!” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇకపోతే, రష్మిక మందన్నా ప్రస్తుతం పాన్-ఇండియా హీరోయిన్‌గా బిజీగా ఉంటే, విజయ్ దేవరకొండ కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ స్థాయిలో ఉన్న స్టార్ సెలబ్రిటీస్ ఇంత సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏదేమైనా, రష్మిక–విజయ్ ఎంగేజ్మెంట్ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది.వీళ్లిద్దరి నుంచి అధికారిక ప్రకటన వస్తుంది ఏమో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: