టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవి ప్రస్తుతం వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. చిరంజీవి చాలా కాలం క్రితమే మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాను మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో చిరంజీవి పాల్గొంటున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం చిరంజీవి "విశ్వంబర" మూవీ తో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మన శంకర వర ప్రసాద్ అనే సినిమాలో కూడా హీరో గా నటిస్తున్నాడు.

మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమణి నయనతార హీరోయిన్గా నటిస్తోంది. బీమ్స్ సిసిరిలీయో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ప్రోమో ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ప్రోమో కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. 

దానితో ఈ మూవీ యొక్క ఫస్ట్ సింగల్ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ నెంబర్ 1 లో కొనసాగుతోంది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ మూవీ లోని మొదటి సింగల్ మీసాల పిల్ల అని సాగనుంది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే ఈ సాంగ్ యొక్క ఫుల్ లిరికల్ వీడియో వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: