
అంతేకాదు — ఇండస్ట్రీలో హీరోయిన్ రెమ్యునరేషన్ పెరగడానికి కారణమైన నటి కూడా నయనతారే. ఒకప్పుడు హీరోయిన్‌లు హీరోల కంటే చాలా తక్కువ పారితోషికం తీసుకునే రోజుల్లో, నయనతార తన ప్రతిభతో, తన మార్కెట్ విలువతో, 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకొని మహిళా నటీమణుల స్థాయిని పూర్తిగా మార్చేసింది. అప్పటివరకు హీరోయిన్‌లు అంత ఎక్కువ వేతనం ఆశించకూడదని భావించిన నిర్మాతలు కూడా, నయనతార కారణంగానే ఆ ఆలోచన మార్చుకున్నారు. కానీ, నయనతార కెరీర్‌లో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది — ఆమె ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్‌తో ఒక్క సినిమాలో కూడా జంటగా నటించలేదు. ఇది టాలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పటి నుంచో ఆశ్చర్యం కలిగిస్తున్న అంశం. ఎందుకంటే, నయనతార స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది కానీ పవన్ కళ్యాణ్ మాత్రమే ఆ జాబితాలో లేదు.
తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ హీరోలుగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ పేర్లు ముందుగా వినిపిస్తాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పేరే వినిపిస్తుంది.ఆ తరువాత మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, వంటి టాప్ స్టార్స్ పేర్లు వస్తాయి. ఈ లిస్ట్‌లో ఉన్న హీరోలందరితో నటించినా, ఆమె పవన్ కళ్యాణ్‌తో మహేశ్ బాబుతో మాత్రం నయనతార జోడీ కుదరలేదు.ఇందుకు కారణం ఏమిటి? అనే ప్రశ్న ఫ్యాన్స్‌ను చాలా కాలంగా వేధిస్తోంది. వాస్తవానికి గతంలో పలు దర్శకులు, నిర్మాతలు నయనతారను పవన్ కళ్యాణ్‌తో నటింపచేయడానికి ప్రయత్నించారట. ముఖ్యంగా వకీల్ సాబ్ సినిమా సమయంలో ఆమెను ఎంపిక చేసే ఆలోచన కూడా జరిగిందట. అయితే ఆ సినిమాలో పాత్ర పెద్దది కాదని భావించి, నయనతార మర్యాదపూర్వకంగా ఆ ఆఫర్‌ను వదిలేసిందట. మొదట శృతిహాసన్ కంటే ముందు నయనతార పేరే పరిగణనలోకి వచ్చిందని సమాచారం.
అంతేకాదు, పవన్ కళ్యాణ్‌తో చేయవలసిన మరో రెండు మూడు ప్రాజెక్టులు కూడా నయనతార స్వయంగా నిరాకరించడం జరిగిందట. అందుకే ఇప్పటివరకు ఈ జంట తెరపై కనిపించలేదు. ఇక భవిష్యత్తులో ఈ ఇద్దరు కలిసి నటించే అవకాశం ఉందా? అని అడిగితే, సినీ వర్గాలు “అది అసాధ్యం” అని చెబుతున్నాయి. ఎందుకంటే ఇద్దరి కెరీర్ దిశలు, ప్రాధాన్యతలు, ఇప్పుడు పూర్తిగా వేరే దారిలో ఉన్నాయి.దాంతో, టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్‌తో నటించని స్టార్ హీరోయిన్స్‌లో నయనతార పేరు అలా చరిత్రలో నిలిచిపోతుంది. మహేశ్ బాబు తో కూడా ఆమె ఒక్క సినిమాలో కూడా స్క్రీన్ షేర్ చేసుకోలేదు..!!