
ఈ క్రమంలోనే తాజాగా ఆయన మాట్లాడుతూ ... " కొన్ని కథలకు సెట్స్ లో తెరకెక్కించడం ఇబ్బంది అవుతుంది . కానీ కాంతారా చాప్టర్ 1 మాత్రం కదా రాస్తున్నప్పుడే చాలా ఇబ్బందులు అనిపించాయి . కానీ ప్రేక్షకులు ఇస్తున్న సపోర్ట్ను గుర్తు పెట్టుకుని ఇది ఒక బాధ్యత అనుకుని పూర్తి చేశాం . ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ వెనకడుగు వెయ్యలేదు . అన్ని అడ్డంకులు దాటుకుని సినిమా తీస్తే మంచి హిట్ అయింది కూడా . నేను తరువాత జై హనుమాన్ చిత్రంలో నటిస్తున్నాను . అది వచ్చే జనవరి నుంచి సెట్స్ మీదకు వెళ్ళనుంది . దాని తరువాత మళ్లీ నేను డైరెక్ట్ చేసే సినిమా వస్తుంది కూడా .
దీనికి ఇంకో రెండు ఏళ్ళు పడుతుంది . చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి . వాటన్నిటిని ఒక్కొక్కటిగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్న . ఏ మూవీ చేసినా సరే ప్రేక్షకులను మెప్పించాలనే ఉద్దేశమే నాకు ఉంది " అంటూ కామెంట్స్ చేశాడు రిషబ్ శెట్టి . ప్రజెంట్ రిసెప్షన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి . ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రూపొందుతున్న జహ హనుమాన్ మూవీ పై ఏ విధమైన హైప్స్ ఉన్నాయో మనందరికీ తెలిసిందే . హనుమాన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ జై హనుమాన్ ని ఏ విధంగా ప్లాన్ చేస్తాడనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది .