సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలకు అభిమానులు ఉండ డం అనేది సర్వసాధారణమైన విషయం. ఇక అలా ఒక హీరో అభిమానులు తమ హీరోను వేరే ఎవరైనా వ్యక్తులు ఏమైనా అన్నట్లయితే మా హీరోను అలా అంటావా అని ఎదురు హీరో పై మాటల దాడి చేయడం జరుగుతున్న సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక అలా ఎదుటి హీరో పై మాటల దాడి చేస్తున్న వారిలో ఎంత మంది ఆ హీరోకు నిజమైన అభిమానులు అనేది మాత్రం స్పష్టంగా తెలియదు.

ఎవరైనా అనేసి మేము ఆ హీరో అభిమానులం అన్న చెల్లుతుంది. ఇకపోతే ఇకపై అలా చెల్లకుండా అల్లు అర్జున్ ఒక బాధ్యతాయుతమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. చాలా కాలం క్రితం సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోలకు ఉన్న ఫ్యాన్స్ రిజిస్ట్రేషన్ చేసుకొనేవారు. దానితో ఎవరు ఏ హీరో అభిమానులు అనేది స్పష్టంగా తెలిసిపోయేది. ఇప్పుడు అలాంటి సిస్టమ్ లేదు. కానీ అల్లు అర్జున్ మరో సారి అలాంటి సిస్టమ్ ను తీసుకురావాలి అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ప్రతి గ్రామంలో కూడా రిజిస్ట్రేషన్ తీసుకునే విధంగా పద్ధతిని తీసుకు రానున్నట్లు , దానితో ఏ సమయం లోనైనా ఎవరైనా అల్లు అర్జున్ కు సపోర్ట్ చేసిన వారు తన అభిమానుల ..? కాదా అనేది స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది.

దానితో అనవసరపు వ్యక్తులు అల్లు అర్జున్ కి సంబంధించిన విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇలా అల్లు అర్జున్ తన అభిమానులను రిజిస్ట్రేషన్ చేసుకునే పద్ధతిని తీసుకురావాలి అనుకుంటూ ఉండటంతో ఆయన అత్యంత బాధ్యతయుతంగా ప్రవర్తిస్తున్నాడు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa