టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో విజయ్ దేవరకొండ ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చూపులు మూవీ లో హీరో గా నటించి మంచి విజయాన్ని అందుకొని మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఈయన నటించిన అర్జున్ రెడ్డి , టాక్సీవాలా సినిమాలు కూడా మంచి విజయాలు సాధించడంతో ఈయనకు ఒక్క సారిగా తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు వచ్చింది. టాక్సీవాలా సినిమా తర్వాత ఈయన చాలా సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఏ మూవీ ద్వారా కూడా ఈయనకు మంచి విజయం దక్కలేదు.

ఆఖరిగా ఈయన కింగ్డమ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కూడా విజయ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర చేదు అనుభవాన్ని మిగిల్చింది. ప్రస్తుతం విజయ్ , రాహుల్ సంకృతీయన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇది వరకు విజయ్ , రాహుల్ కాంబోలో రూపొందిన టాక్సీవాలా మూవీ మంచి విజయం సాధించడంతో వీరి కాంబోలో ప్రస్తుతం రూపొందుతున్న సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. విజయ్ ఇప్పటికే రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన్ అనే టైటిల్ తో రూపొందిన సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కానుంది. ఈ మూవీని దిల్ రాజు నిర్మించబోతున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి మరో మూవీ ని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్న విజయ్ మరో క్రేజీ దర్శకుడి మూవీ కి తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో విజయ్సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విక్రమ్ ఓ కథను విజయ్ కి వినిపించగా ఆ కథ బాగా నచ్చడంతో విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd