ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే గూగుల్, ఇన్ఫోసిస్, టిసిఎస్, కాగ్నిజెంట్ వంటివి ఎన్నో టేక్ దిగ్గజ సంస్థలు వచ్చాయి.. ఇప్పుడు తాజాగా విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ నెలకొల్పేందుకు ఏపీ ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన ఒప్పందాన్ని చేసుకుంది. ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ డేటా సెంటర్ కోసం ఎన్నో రాష్ట్రాలు పోటీపడినప్పటికీ చివరికి ఆంధ్రప్రదేశ్ ఈ డేటా సెంటర్ ని సొంతం చేసుకోవడంతో అటు రాష్ట్ర ప్రజలు కూడా ఆనందాన్ని తెలియజేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ చెరువతోనే ఈ గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ కి రప్పించామంటూ సీఎం చంద్రబాబు వెల్లడించారు. అయితే గతంలో వైసిపి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా విశాఖపట్నంని అభివృద్ధి చేశారు. అందుకే అప్పుడు ఆదాని,అంబానీ వంటి వారు కూడా సందర్శించడం జరిగింది. అక్కడే వారు కూడా తమ సంస్థలను పెట్టాలని భావించారు.


అయితే ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈసారి విశాఖపట్నంని డెవలప్మెంట్  చేసుకొస్తున్నారు. విశాఖపట్నంలో ఇలాంటి ఎన్నో సంస్థలకు అవకాశాలు ఇస్తున్నారు.  ముఖ్యంగా అన్ని సదుపాయాలు కల్పించడంతో పాటుగా రాయితీలు ఇవ్వడం జరుగుతోంది. ఇలా చాలా టెక్ సంస్థలు బెంగళూరు, హైదరాబాదు వంటి పరిసర ప్రాంతాలను వదిలి ఏపీకి రావడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఈ గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ కి రావడం పైన ఇతర రాష్ట్రాల మంత్రులు , నేతలు సైతం తమ అక్కసు తెలియజేస్తున్నారు.


ఈ నేపథ్యంలోనే కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున  ఖర్గే కుమారుడు అయిన ప్రియాంక ఖర్గే.. మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. వేలకోట్ల రూపాయల ప్రజాధనం వాళ్ళకి ఖర్చు పెట్టేస్తోందంటూ అలాంటి ఖర్చులతో మేము ఎలా పోటీ పడతాంలే, దీనివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా నాశనం చేస్తున్నారంటూ వెటకారం చేస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ కి రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ తన అక్కసును చూపిస్తోంది. ఈ వ్యాఖ్యల పైన నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ గూగుల్ డేటా సెంటర్ ఏపీకి రావడం పై ఇతర రాష్ట్రాలలో అప్పుడే మంట మొదలైంది అంటూ మంత్రి నారా లోకేష్ ట్విట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: