
ముఖ్యంగా కుటుంబ విలువలు, నైతిక బాధ్యత లేని వారిని హౌస్ లోకి ఎలా తీసుకుంటారు అంటూ ఆగ్రహాన్ని తెలుపుతున్నారు. ఇప్పుడు తాజాగా జనసేన పార్టీ సభ్యురాలు అయిన కుసుమ రాయల్ అనే యువతి మాధురి పైన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. దివ్వేల మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేందుకు కోటి రూపాయల వరకు లంచం ఇచ్చిందంటూ ఆరోపణలు చేసింది. ఒకవేళ ఆషోలో గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీ రూ .50 లక్షల రూపాయలే కానీ అలాంటిది ఆమె కోటి రూపాయలు ఇచ్చి మరి హౌస్ లోకి వెళ్లిందట అంటూ తెలిపింది.
దివ్వెల మాదిరి కేవలం నేమ్, సేమ్ కోసమే ఇలా పాట్లు పడుతోందని తెలియజేసింది. అలాగే ఆయేషా కూడా రికమండేషన్ ద్వారా హౌస్ లోకి వెళ్లిందంటూ కుసుమ రాయల్ తెలియజేస్తోంది. ఇదే కాకుండా బిగ్ బాస్ షో కి వెళ్లాలి అంటే కచ్చితంగా లంచం ఇవ్వాల్సిందే అనే ఆరోపణలు ఎన్నో ఏళ్ల నుంచి వినిపిస్తున్నాయని, గతంలో బిగ్ బాస్ సీజన్ 2 లో కూడా సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన నూతన నాయుడు కూడా కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి మరి కంటెస్టెంట్ గా ఎంపికయ్యారనే ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు అలాంటి ఆరోపణలే దివ్వెల మాధురి పైన వినిపిస్తున్నాయి.