ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్లు, పోస్టర్లు వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే. ప్రభాస్ బర్త్డే రోజు స్పిరిట్ మూవీ నుండి ఒక ఆడియో ని రిలీజ్ చేశారు సందీప్ రెడ్డి వంగా.. అలాగే హనూ రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా టైటిల్ ని కూడా అధికారికంగా అనౌన్స్ చేశారు. అలా అందరూ అనుకున్నట్టే సినిమాకి ఫౌజీ టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇక ది రాజా సాబ్ మూవీ నుండి కొత్త పోస్టర్ కూడా వైరల్ అయింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే..ఫౌజీ మూవీ లో కన్నడ భామ నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.అయితే ఇప్పటికే  ఫౌజీ మూవీలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్ గా ఫిక్స్ అయింది.అయితే మరో కీ రోల్ కోసం కన్నడ భామని తీసుకున్నారట చిత్ర యూనిట్.

ఇక ఆమె ఎవరంటే ఛైత్ర జే అచర్.. నటిగా.. సింగర్ గా..శాండిల్ వుడ్ లో రాణిస్తున్న ఛైత్ర జే అచర్ ఫౌజీ మూవీలో ఒక కీ రోల్ పోషిస్తున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఛైత్ర ఓవైపు సింగర్ గా ఇండస్ట్రీలో రాణిస్తూనే మరోవైపు నటిగా 3BHK, సప్త సాగర దాచే ఎల్లో వంటి సినిమాల్లో నటించింది. అలా తాజాగా ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ  మూవీలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ కన్నడ భామ నక్కతోక తొక్కింది పో అంటూ కామెంట్లు పెడుతున్నారు..
ఇక ప్రభాస్ ఫౌజీ మూవీ విషయానికి వస్తే.. హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ పిరియాడిక్ యాక్షన్ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది.ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటించబోతున్నట్టు ఇప్పటికే పలు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్ గా.. నటించగా బాలీవుడ్ దిగ్గజ నటులు అయినటువంటి అనుపమ్ ఖేర్,మిథున్ చక్రవర్తిలు కీ రోల్స్ పోషిస్తున్నట్టు తెలుస్తోంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ప్రభాస్ కి ఉన్న బిజీ షెడ్యూల్లో వచ్చే ఏడాది ఫౌజీ మూవీ విడుదలవుతుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: