పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఓజి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటువంటి ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించగా ... సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించగా ... ప్రకాష్ రాజ్ , అర్జున్ దాస్ , శ్రేయ రెడ్డి మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ని డి వి వి దానయ్య నిర్మించాడు.

ఈ సినిమాపై మొదటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానితో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి ముఖ్యంగా ఈ సినిమాకు నైజాం ఏరియాలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు నైజాం ఏరియాలో ఏకంగా 54 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానితో ఈ సినిమా భారీ టార్గెట్ తో నైజాం ఏరియాలో బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగింది. ఇక ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు నైజాం ఏరియాలో దక్కిన కూడా ఈ సినిమా నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను మాత్రం కంప్లీట్ చేసుకోలేకపోయింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఆల్మోస్ట్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది.

నైజాం ఏరియాలో కూడా ఈ సినిమా బాక్సా ఫీస్ రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. నైజాం ఏరియాలో ఇప్పటివరకు ఈ సినిమాకు 52.50 కోట్ల రేంజ్ లో షేర్ కలక్షన్లు దక్కాయి. దానితో ఈ సినిమా నైజాం ఏరియాలో 1.5 కోట్ల రేంజ్ లో నష్టాలను అందుకున్నట్లు తెలుస్తోంది. నైజాం ఏరియాలో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసిన కూడా చివరగా మాత్రం ఈ ఏరియాలో నష్టాలనే అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: