బ్యానర్ : అడ్ సౌడ్స్ నటీనటులు : ప్రభాకరన్, శ్రీనివాసన్, అంజలి, సునీతా వర్మ, అస్మిత తదితరులు సంగీతం : శ్రీకాంత్ దేవా నిర్మాత : టి.రామ్ ప్రసాద్ దర్శకత్వం : ప్రభాకరన్ అచ్చ తెలుగు అమ్మాయి అంజలి తమిళంలో నటించిన షాపింగ్ మాల్, జర్నీ సినిమాలు తెలుగులోనూ హిట్ట అయ్యాయి. అమెకు ఇక్కడ మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి. అలాగే అమె ప్రస్తుతం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్ సరసన నటిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో అంజలి నటించిన ఓ తమిళ చిత్రం సతీ లీలావతి పేరుతో తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సతీ లీలావతి కథేంటో చూద్దాం. చిత్రకథ : ప్రాణాపయ స్థితిలో ఉన్న లేడీ డాక్టర్ (సునీతా వర్మ)ను ఒక క్రిమినల్ ( ప్రభాకరన్) రక్షిస్తాడు. ఆ డాక్టర్ అతన్ని పెళ్లి చేసుకుంటుంది. ఆ క్రిమినల్ ఎవరు.?, ఆ లేడీ డాక్టర్ వద్దకు వచ్చే షెషంట్స్ తో అతను ఎలా ప్రవర్తించాడు.? చివరికి ఆ క్రిమినల్ ఏమయ్యాడు..? అనేదే చిత్రకథ. నటీనటుల ప్రతిభ : ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రభాకరన్ ఈ సినిమాలో క్రిమినల్ గా నటించాడు. సినిమా మొత్తం అతని చుట్టూ తిరుగుతుంది. ప్రబాకరన్ బాగా నటించాడు. ఈ నెగిటివ్ పాత్రలో రాణించాడు. డాక్టర్ గా సునీతా వర్మ ఓకే. క్రిమినల్ ను ప్రేమించే అమ్మాయిగా అస్మిత నటించింది. ఇక తెలుగు అమ్మాయి అంజలి కార్యెక్టర్ సెకండాఫ్ కు కొంచెం ముందుగా ప్రవేశిస్తుంది. అంజలి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హోమ్లీగాను, సెక్సీగాను కనిపించడం, మెప్పించడం ఆమె ప్రత్యేకత. ఆమెకు ఒక మంచి హిట్ పడితే నటి సౌందర్యలా గుర్తింపు తెచ్చుకునే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. భర్తను ప్రేమించే అమాయక యువతిగా, మాతృత్వం కోసం తపించే గృహిణిగా బాగా నటించింది. మిగిలిన వారు తమ తమ పాత్రల పరిధిలో నటించారు. సాంకేతిక వర్గం పనితీరు : ఫోటోగ్రఫీ బాగుంది. సంగీతం బాగనే ఉంది. ఆర్పీ పట్నాయక్ గానం చేసిన ప్రియతమా.. పాట, చిత్రీకరణ బాగుంది. మాటలు సినిమాకు తగినట్లుగా ఉన్నాయి. కథకు తగ్గట్లుగానే నిర్మాతలు ఖర్చు చేశారు. దర్శకత్వం విషయానికి వస్తే.. దర్శకుడు ఈ సినిమాలో ఒక పాత్ర పోషించడంతో ఆ పాత్రపైనే ఎక్కువ దృష్టి పెట్టాడని పిస్తుంది. అయితే తన పాత్ర తో పాటు సినిమా బాగా రావడానికి ప్రబాకరన్ పడిన కష్టాన్ని మనం కాదన లేం. సినిమా ఫస్టాఫ్ సాధారణంగా నడిచినా, సెకండాఫ్ అకట్టుకునే విధంగానే సాగుతుంది. కొన్ని మలుపులతో సాగే విధంగా సెకండాఫ్ ను దర్శకుడు నడిపాడు. అయితే ఇలాంటి కథలు, నెగిటివ్ టచ్ తో కూడిన క్యారెక్టర్ సినిమాలో ప్రధానంగా సాగడం తెలుగు ప్రేక్షకులను అంతగా అకట్టుకోవని తెలుగ సినిమా చరిత్రలో చూస్తే మనుకు కనిపిస్తూనే ఉంటుంది. హైలెట్స్ : ప్రబాకరన్ నటన, అంజలి అభినయం, సెకండాఫ్ లో సాగే కొన్ని సన్నివేశాలు డ్రాబాక్స్ : వినోదం లేకపోవడం, నెగిటివ్ కార్యక్టర్ పై పెట్టిన దృష్టి హీరో క్యారెక్టర్ పై లేకపోవడం, సాధారణంగా సాగే ఫస్టాఫ్ లో సన్నివేశాలు చివరిగా : అంజలి ప్రధాన ఆకర్షణగా తెలుగులో విడుదలైన సతీ లీలావతి చిత్రంతో దర్శకుడు, నటుడు ప్రభాకరన్ తన ప్రభావం చూపించడానికి ప్రయత్నించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: