భూమిలో గుప్తనిధులు ఉంటాయి అని ఎంతోమంది చెబుతూ ఉంటారు. ఈ గుప్త నిధులను వెలికితీసేందుకు ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎంతోమందికి నిరాశే ఎదురవుతు ఉంటుంది. కానీ అదే సమయంలో కొన్నిసార్లు ఏదో పని నిమిత్తం భూమిని తవ్వుతున్న సమయంలో ఇక గుప్తనిధులు బయట పడటం వంటివి కూడా జరుగుతూ ఉంటుంది. కేవలం గుప్త నిధులు మాత్రమే కాదు ఏకంగా భూమి లోపల ఉన్న నిర్మాణాలు కూడా బయట పడుతూ ఒక్కోసారి అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయ్. మరికొన్ని సార్లు పురాతన విగ్రహాలు కూడా బయట పడుతూ ఉంటాయి అనే విషయం తెలిసిందే.

 ఇక ఇలాంటి తరహా ఘటన ఏదైనా జరిగింది అంతే చాలు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. కాంబోడియా ప్రావిన్స్లోని వాయువ్య ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ గ్రామం పేరు కోర్క్ వాట్. అక్కడ సబో్యూన్ రాన్ అనే 42 ఏళ్ల వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. కుటుంబ ఇబ్బందులు తీర్చేందుకు  మరుగుదొడ్డి నిర్మించాలని భావించాడు. తన కుమారులతో కలిసి గుంత తవ్వడం చేసాడు. అయితే దాదాపు రెండు మీటర్లు గుంత తగ్గిన తర్వాత వింత శబ్దం వారికి వినిపించింది.


 ఈ క్రమంలోనే ఏంటా అని చూస్తే ఒక నీలిరంగు రాయి వారికి కనిపించింది. వెంటనే రాయి కడిగి శుభ్రం చేశారు. ఇక ఆ తర్వాత ఒక పురాతన కాంస్య విగ్రహం కూడా గుర్తించి ఆశ్చర్యపోయాడు. మరి కొంచం తవ్వితే  మరో నాలుగు విగ్రహాలు బయటపడ్డాయి. ఈ క్రమంలోనే వాటిని ఇంట్లో ఉంచి శాంతిని కోరుతూ విగ్రహాలకు పూజలు కూడా చేశాడు. ఈ వార్త ఆ నోటా ఈ నోటా పడి చివరికి పోలీసులు వరకు వెళ్ళింది. దీంతో అతని ఇంటికి చేరుకున్న పోలీసులు విగ్రహాల ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri