
ఎవరో తెలియని వ్యక్తి వచ్చి స్టాప్ అనగానే పశువులన్నీ కూడా ఆగిపోయాయి. ఇక అతను చెప్పినట్లుగానే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ఇంస్టాగ్రామ్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇది చూసి నేటిజన్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారూ అని చెప్పాలి. ఒక వ్యక్తి సైక్లింగ్ చేస్తూ చిన్న బ్రేక్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే సైకిల్ రోడ్డు పక్కన ఆపిన అతను.. కెమెరాలో బ్యాటరీలు అమర్చి ఆ తర్వాత స్నాక్స్ తినడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఒక ఆవుల మంద ఇక అతడు ఉన్న వైపు రావడం కనిపించింది.
అయితే మరోవైపు నుంచి రైతు పరిగెత్తుకుంటూ వచ్చి ఏకంగా ఆవుల మందని ఆపండి సార్ అంటూ గట్టిగా కేకలు వేశాడు. దీంతో ఆ వ్యక్తికి ఆవుల మందను ఎలా ఆపాలో మొదట అర్థం కాలేదు. ఇక ఆ తర్వాత వాహనాలను ఆపినట్లుగానే తనకు తెలిసిన పద్ధతిలో ఆవుల మందు నిలబడి స్టాప్ అంటూ అరిచాడు. అయితే అతను అలా అనగానే ఆవులు ఒక్కసారిగా ఆగిపోయాయి. దీంతో ఏం జరుగుతుందో ఆ వ్యక్తికి కూడా అర్థం కాలేదు. ఇక ఆ తర్వాత రైతు వచ్చి వాటిని పొలంలోకి తోలుకు పోయాడు. ఇదంతా వీడియోలో రికార్డు అవ్వడంతో ఇది చూసి నేటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు.