దేశవ్యాప్తంగా మూడు లోకసభ మరియు 30 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు శనివారం రోజు  మొదలయ్యాయి . ఈ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ మొదలయ్యింది . ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తమ పరువు నిలబెట్టుకోవాలని అధికార పార్టీ లు వేచి చూస్తున్నాయి . ఈ పోలింగ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వాలపై పెద్దగా ప్రభావం చూపనప్పటికీ ఈ ఉపఎన్నికలు వివిధ పార్టీ లకు మరియు ముఖ్యమంత్రులకు ప్రతిష్టాత్మకం కానున్నాయి. నేడు దేశవ్యాప్తంగా ఉన్న ఒక కేంద్రపాలిత ప్రాంతం మరియు 13 రాష్ట్రాల పరిధిలో మొత్తం 33 స్థానాలకు ఎన్నికలు  జరుగనున్నాయి. అందులో మూడు లోక్ సభా స్థానాలకు కాగా 30 అసెంబ్లీ స్థానాలు పోటీ జరగనుంది. ఇప్పటికే పోలింగ్  ఈ రోజు ఉదయం నుండి మొదలయింది. 



కేంద్ర పాలిత ప్రాంతం ఐన  దాద్రా మరియు నగర్ హవేలీ మరియు  హిమాచల్ ప్రదేశ్‌లో నుండి  మండి మరియు మధ్యప్రదేశ్‌ నుండి  ఖాండ్వా  అనే ప్రాంతాల పార్లమెంటు స్థానాలకు ఎన్నిక జరుగుతూ ఉన్నాయ్ , 14 రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాలకు గాను తెలంగాణ నుండి హుజురాబాద్, బెంగాల్ నుండి దిన్హాత , శాంతిపూర్, కర్దహ, గోసబా , బీహార్ నుండి తార్పుర్, కుశేశ్వర్ ఆస్టన్ ,  మధ్యప్రదేశ్ నుండి ర్తెగాన్ , ప్రిత్విపూర్, జోబట్,   రాజస్థాన్ నుండి వల్లభనగర్,  దారియవాడ్, ఆంధ్ర ప్రదేశ్ నుండి బద్వేల్, ఇంకా హర్యానా నుండి ఒక స్థానానికి , అస్సాం నుండి 5 స్థానాలకు , హిమాచల్ ప్రదేశ్ నుండి మూడు స్థానాలకు , కర్ణాటక నుండి రెండు స్థానాలకు , మహారాష్ట్ర నుండి ఒకస్థానానికి , మేఘాలయనుండి  మూడు స్థానాలకు , మిజోరాం నుండి ఒకస్థానానికి , నాగాలాండ్ నుండి ఒక స్థానానలకు గాను మొత్తం 30 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక జరుగనుంది.




అయితే తెలుగు రాష్ట్రాలలో జరిగే ఎన్నికలు కేసీఆర్ మరియు జగన్ లకు ప్రతిష్టాత్మకం కానున్నాయి. అయితే హుజురాబాద్ ఎన్నికలు మాత్రం దేశవ్యాప్తంగా ఒకంత ఉత్కంఠ రేపుతోంది. ఈటెల గెలుపు ఖాయం అని ఇప్పటికే పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ తరుపున ఈటెల గెలుపు అతని రాజకీయ జీవితాన్ని నిర్దేశిస్తుందనే చెప్పాలి. అయితే ఈ ఎన్నికల తుది ఫలితాలను  నవంబర్ 2 న విడుదల చేయనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: