రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలపై ఉన్న బీజేపీ జాతీయ నాయకత్వం.. ఆదిశగా కావాల్సిన కార్యాచరణను తనదైన శైలిలో అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆర్ ఎస్ ఎస్ మూలాలున్న నాయకులను బీజేపీ సారథులుగా నియమించింది. దీంతో పాటు సదరు నాయకులకు వాగ్ధాటి కూడా ఉండడం పార్టీకి కలిసి వచ్చే పరిణామం. అయితే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఏమైనా చేయమని సోము కి కేంద్ర ప్రభుత్వం అధికారాలు ఇచ్చిందట.