రాజకీయాల్లో సమిష్టి కృషి, ఇతర నాయకుల సహాయ సహకారాలు లేనిదే ఏ పార్టీ ముందుకు సాగదు.. పార్టీ కార్యకర్త లేనిదే ఏ పార్టీ కనీస గుర్తింపు కూడా తెచ్చుకోలేదు.. అయితే ఎంతో ఫ్యాన్ బేస్, కార్యకర్తల అండ ఉన్న టీడీపీ పార్టీ కి ఇప్పుడు ఎవరి సహకారం లేక వెనకబడి ఉందని తాజా పరిస్థితులను బట్టి తెలుస్తుంది. అంతేకాదు ఇందుకు కారణం కూడా వారు వెల్లడిస్తున్నారు.. చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలే ఇప్పుడు పార్టీ కి చాలామందిని దూరం చేస్తుందని అంటున్నారు. ఇటీవలే చంద్రబాబు పార్లమెంట్ ఇన్ ఛార్జ్ లను నియమించిన సంగతి తెలిసిందే..