రాష్ట్ర విభజనపై దాదాపు సంప్రదింపులు పూర్తయ్యాయి. వ్యతిరేకత తగ్గుతూ వస్తోంది.. పార్టీలన్నీ దాదాపు విభజన ఖాయం అనే నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో బీజేపిలో అంతర్మధనం మొదలైంది. ఇప్పటికే తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెబుతూనే, సీమాంధ్రకు తగిన న్యాయం చేయలంటున్న కమలనాథులు విభజన డ్రాప్టు పార్లమెంటుకు, అసెంబ్లీకి వస్తే వారి వైఖరి ఎలా ఉండబోతోంది..? ఇవే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయ్. రాష్ట్ర విభజనపై వడివడిగా అడుగులు వేస్తున్న యూపీఏ ప్రభుత్వం.. ప్రక్రియను తుది అంకానికి చేర్చింది. ఈనెల 21న చివరి భేటీకి సిద్ధమైన జివోఎం విభజన బిల్లుకు తుదిరూపం ఇవ్వాలనుకుంటోంది. ఇప్పటికే పలు దఫాలుగా సంప్రదింపులు జరిపిన కేంద్రం.. 23న క్యాబినెట్ భేటీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సమావేశంలో డ్రాఫ్టుకు పచ్చజెండా చూపాలనుకుంటున్నారు. దీంతో ప్రధాన ప్రతిపక్షం బీజేపీలో అంతర్మథనం మొదలైంది. ఇప్పటికే తెలంగాణకు కట్టుబడి ఉన్నామంటున్న బీజేపీ విభజన తర్వాత సీమాంధ్రకు తగిన న్యాయం చేయాలంటోంది. విభజన బిల్లు పార్లమెంటుకు, అసెంబ్లీకి వస్తే బిజేపి తీరు ఎలా ఉంటుందన్నదానిపై ఇప్పటికీ భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఆది నుంచి తెలంగాణకు అనుకూలంగా ఉన్న బీజేపీ సీడబ్ల్యుసీ తెలంగాణ నిర్ణయం తీసుకోగానే దీనిపై ఓ క్లారిటీ ఇవ్వలేకపోతోందని సమాచారం. ఆ పార్టీలోనూ విభజన చిచ్చు రేగడం.. పార్లమెంటులో సీమాంధ్ర ఎంపీల సస్పెషన్ పై అభ్యంతరం చెప్పడం దీనికి ఊతం ఇచ్చింది. దీంతో రానున్న రోజుల్లో బిజేపి ఎలాంటి స్టెప్ వేస్తుందనేది రాజకీయ విశ్లేషకులకు అంతుపట్టకుండా ఉంది. బిజేపి నేతలు మాత్రం రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం కాదని అంటున్నారు. కాంగ్రెస్ తీరు సరిగా లేకున్నా ఈ ప్రక్రియలో పాల్గొంటున్నామని చెబుతున్నారు. జివోఎం అఖిలపక్షంపైనా స్పందించామని అంటున్నారు. కాని కాంగ్రెస్ డ్రామాలాడుతోందని విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రం విడిపోతే నక్సలిజం పెరుగుతుందంటున్న సిఎం కిరణ్.కు 2004 లో టిఅర్ఎస్ తో కలిసి పని చేసిన్పప్పుడు అది గుర్తుకు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర విభజన ముసాయిదాకు ఈ నెల 23 లోపు తుది రూపం రానునడంతో బిజేపిలో ఉత్కంఠ నెలకోంది. ముఖ్యంగా హైదరాబాద్, భద్రాచలం, 371 డి అంశాలపై బీజేపీ సీమాంధ్ర, తెలంగాణ నేతల్లో కూడా తలోమాట వినిపిస్తోంది. తుది నిర్ణయాన్ని పార్టీకే వదిలిపెట్టిన రాష్ట్ర బీజేపీ నేతలు అది ఇరుప్రాంతాలకు అమోదయోగ్యంగా ఉండాలని కోరుతున్నారు. విభజన ముసాయిదా ఈ నెలాఖర్లోపు క్యాబినెట్ అమోదం పొంది, అసెంబ్లీకి వస్తుందంటూ వార్తలు వినిపిస్తుండడంతో శాసనసభలో గట్టిగా తమ వాదన వినిపించాలనుకుంటున్నారు బీజేపీ రాష్ట్ర నేతలు. అంతా అనుకున్నట్లు జరిగితే శీతకాల పార్లమెంట్ సమావేశల్లోనే బిల్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఉంటుందంటూ బిజేపి ఇప్పటికి చెబుతున్న తరుణంలో వారి వ్యూహం ఎలా ఉంటుందో అని అంతా ఎదురుచూస్తున్నారు. అర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల విభజనకు సాధారణ మెజార్టీ చాలంటున్న నేపథ్యంలో పార్లమెంట్ లో బిజేపి పాత్రపై భిన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా మరో నెలలో రాష్ట్ర విభజనపై రాజకీయ పార్టీల తీరు ఏంటో బట్టబయలు కానుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: