ఏపీలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్- జగన్ సర్కారు పిల్లీ ఎలుకా చెలగాటం కొనసాగుతోంది. ఏపీ హైకోర్టు .. ఎస్‌ఈసీ పదవీకాలం కుదిస్తూ ఇచ్చిన ఆర్డినెన్సును కొట్టేస్తూ తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ వెంటనే నిమ్మగడ్డ తాను బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు ప్రకటించడం వివాదాస్పదమైంది. ఏపీ హైకోర్టు తీర్పులో సాంకేతిక తప్పిదాలు ఉంటున్నాయని చెబుతున్న ఏపీ ఈ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లింది.

 

 

ఏపీ హైకోర్టు ఆర్డినెన్సును కొట్టేయడం వల్ల నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్థానంలో వచ్చిన జస్టిస్ కనగరాజ్ నియమాకాన్ని రద్దు చేసింది. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్థానం ఖాళీ అయ్యింది. వాస్తవానికి ఈ స్థానంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రావాలి. కానీ ఇందుకు ఏపీ సర్కారు సుముఖంగా లేదు. వీలైనంత వరకూ ఆయన్ను పీఠం ఎక్కనీయకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు వీలైనన్ని కారణాలు ఎత్తి చూపించేందుకు ప్రయత్నిస్తోంది.

 

 

మరి ఒకవేళ సుప్రీంకోర్టులో తీర్పు జగన్ సర్కారుకు అనుకూలంగా వస్తే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఎవరో ఒకరిని నియమించాల్సి వస్తుంది. అందుకే ముందు జాగ్రత్తగా ఏపీ సర్కారు ఆ పనిలో పడిందట. అర్హులైన వ్యక్తుల జాబితా తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రింకోర్టు కనుక స్టే ఇచ్చే పక్షంలో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి మన్మోహన్ సింగ్ ను ఈ పదవికి ఎంపిక చేయాలని జగన్ సర్కారు భావిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.

 

 

వాస్తవానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. ఇప్పటికిప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే.. చెప్పడం కష్టమే. ఇప్పటి వరకూ ఉన్న కనగరాజ్ నియామకం రద్దయింది. పాత కమిషనర్ ఇంకా బాధ్యతలు చేపట్టలేదు. ఇలాంటి విచిత్రమైన పరిస్థితి చాలా అరుదు అంటున్నారు విశ్లేషకులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: