కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లాలో కరోనా సోకిన ఒక వ్యక్తి అంబులెన్స్ కోసం ఎదురు చూసి చివరికి నడిరోడ్డుపైన ప్రాణాలు వదిలిన తీరును చూశాం. గంటల తరబడి మృతదేహాన్ని తరలించడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇక వైఎస్ జగన్ ప్రభుత్వం వాటిని రాష్ట్రంలోనికి వదిలినప్పుడు అంబులెన్సు లతో ఒక పెద్ద పెరేడ్ నే నిర్వహించింది. ఊర్లన్నీ అంబులెన్సులు అవసరం లేకపోయినా రోజు అవి అన్నీ రోడ్లు తిరిగాయి. కానీ అవసరమైనప్పుడు మాత్రం అందుబాటులో లేకుండా పోయాయి.

 

 

ఏపీలో అంబులెన్సులు కథ గ్రౌండ్ లెవెల్ లో చాలా ఘోరంగా తయారైంది. ఒకే అంబులెన్స్ లో ఒకరిని కాకుండా పది మందికి పైగా కుక్కేసిన తీరుని ఒక జిల్లాలో చూశాం. ఇక తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో ఒక బాధితుడిని బండిలో ఆసుపత్రికి తరలించి వలసిన పరిస్థితి ఏర్పడిన తీరూ చూశాం ఇక అధికార కొన్ని మీడియా వర్గాలు అయితే సాంకేతిక సమస్యలతో అవి రోడ్డు మీద ఆగిపోతున్నట్లు చెబుతున్నాయి. ఇక మొన్నామధ్య డీజిల్ లేకపోవడంతో అర్థాంతరంగా అంబులెన్స్ ఒకటి ఆగిపోయి అత్యవసర సమయంలో బాధితులకు ఉపయోగపడలేకపోయింది. 

 

ఇక విషయంలోని వైఫల్యాలపై సమీక్షించాల్సిన వారు.... ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన వారు ప్రశ్నిస్తే ఎదురుదాడే తప్ప బాధ్యతాయుతమైన సమాధానం మాత్రం అధికార పార్టీ నేతల నుండి రావడం లేదు. అలాగే ఆయా అంబులెన్స్‌ సర్వీసుల్ని నిర్వహిస్తోన్న ప్రైవేటు సంస్థల్ని అప్రమత్తం చేయాలి, వీలైతే హెచ్చరించాలి. ఇవన్నీ మానేసి, విపక్షాలపై ఎదురుదాడికి దిగేందుకు మాత్రమే అధికార పార్టీ నేతలు అత్యుత్సాహం చూపుతుండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: