సమయానికి, సందర్భానికి తగ్గట్టు మాటలు అల్లుకుపోతూ.... సిద్ధాంతాలు వల్లించే అలవాటు
టీఆర్ఎస్ నేతల వ్యవహారం కాస్త ఎక్కువనే చెప్పాలి. మాటల మంత్రాలతో అట్టే ఆకట్టుకుంటారు మన టిఆర్ఎస్ నాయకులు. ఇక
ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రులు హరీశ్..
కేటీఆర్ లు ఈ ఈ విషయంలో కాస్త దూకుడు ఎక్కువగానే చూపిస్తారని టాక్. ఎన్నో సందర్భాల్లో ఇటువంటి తరహా పరిస్థితులను ఎక్కువగానే చూసాం. సమయానుసారంగా వారికి అనుకూలంగా విషయాన్ని అప్పటికప్పుడు ఒక ప్రణాళికను తయారు చేసి ప్రజలకు చెప్పి ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ భవిష్యత్తులో పర్యవసానాలను గురించి పట్టించుకోరు. అప్పట్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒకసారి ఎన్నికల్లో ఓడిన వారిని.. ఆ వెంటనే వచ్చే ఎన్నికల బరిలో దించటంలో ఏమైనా అర్థముందా? అని ప్రశ్నించటం అందరికీ తెలిసిందే.
2018 చివర్లో జరిగిన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వారిని.. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపటం లో తప్పులు వెతికారు. ప్రజలు మాకొద్దు బాబోయ్ అంటూ రిజెక్టు చేసిన వారికి మళ్లీ టికెట్లు ఎలా ఇస్తారంటూ
కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశారు. ప్రజలు మాట కాదని టికెట్లు ఇవ్వడం లో మీ ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తే చాలు ఆ సభల్లో ఈ అంశాన్ని తరచూ ప్రస్తావిస్తూ ఆరోపణలు చేసేవారు
మంత్రి కేటీఆర్.
ఆయన థియరీనే లెక్కలోకి తీసుకుంటే..
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిన కవితకు.. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినా.. ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉండదు. అందుకు భిన్నంగా తాజా ఉప ఎన్నికల్లో 90శాతం ఓట్లతో ఘన విజయాన్ని సాధించారు కవిత.
ఇక
కేటీఆర్ థియరీకి భిన్నంగా చోటు చేసుకున్న పరిణామంపై ఆయనేమంటారో. సమయానికి తగ్గట్లు చెప్పిన థియరీని చెత్తబుట్టలో వేసేస్తారా? తమ అవసరాలకు తెర మీదకు తీసుకొచ్చి చెప్పే ఈ మాటలకి ఇక్కడితో పులిస్టాప్ పెట్టేస్తారా? సరికొత్తగా మళ్లీ మొదలు పెడతారా? అన్నది చూడాలి. ఎందుకంటే.. చెల్లని నాణెం ఎక్కడా చెల్లకూడదన్న
కేటీఆర్ మాటకలు భిన్నంగా.. తాజా ఉప ఎన్నికల్లో భారీ ఎత్తున చెల్లుబాటు కావటంపై ఇప్పుడు ఎలా స్పందించి ఉన్నారా అన్న విషయం పై రాజకీయాల్లో చర్చలు కొనసాగుతున్నాయి.