అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళకు కర్ణాటక హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ ను కర్ణాటక హైకోర్ట్ కొట్టేసింది. జనవరి మాసంలో ఆమెకు జైలు నుంచి విముక్తి కలుగనుందన్న వార్తలొచ్చాయి. ఈ వార్త తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. కర్ణాటక హైకోర్ట్ బెయిల్ ను కొట్టి వేసిన నేపథ్యంలో ఆమె శిభిరం ఢీలా పడిపోయింది. కొన్ని రోజుల క్రితమే శిక్షాకాలాన్ని తగ్గించాలని జైలు అధికారులకు దరఖాస్తు కూడా పెట్టుకున్నారు. ఈ దరఖాస్తును పరప్పన జైలు అధికారులు ఉన్నతాధికారులకు కూడా పంపించారు.
2021లో తమిళనాడు ఎన్నికలు జరుగనున్న తరుణంలో చిన్నమ్మ శశికళ బయటకు వస్తుందని ఈ ఎన్నికల్లో సత్తాచాటాలని ఏఎమ్ఎమ్ కె అభిమానులు, కార్యకర్తలు భావించారు. అందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. అయితే బెయిల్ రద్దు కావడంతో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై శశికళ శిభిరం యోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికల సమయానికి శశికళ బయటకు రాకుంటే ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు.
ఎప్పుడైతే జయలలిత మరణించిందో అప్పటి నుంచి అందరి దృష్టీ శశికళపైనే పడింది. జయలలిత అమ్మ అయితే.. ఈమె చిన్నమ్మ అని కొందరు భావించారు. దీంతో ఆ పార్టీ కూడా రెండు వర్గాలుగా చీలిపోయింది. జయలలిత ఏమో.. పన్నీరుకు కీలక బాధ్యతలు అప్పగించగా.. పళని కూడా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకెళ్లడంతో పళనికి సీఎం బాధ్యతలు దక్కాయి. అయితే ఇపుడు పళని వర్గం.. పన్నీరు శల్వం వర్గం, శశికళ వర్గం ఇలా మూడు వర్గాలుగా ఆ పార్టీ చీలిపోయింది. పన్నీరు సెల్వం, పళని స్వామి ఇద్దరూ కలిసున్నట్టే కనిపించినా.. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే శశికళ ఎపుడు జైలు నుంచి విడుదలవుతుందా అని ఆమె వర్గం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి