సినిమాల్లో మంచి క్రేజ్ ఉన్న పవన్ రాజకీయాల్లో తడబడుతున్న విషయం తెలిసిందే. కాకపోతే రాజకీయాల్లో సైతం తనకు మంచి క్రేజ్ ఉన్నా సరే అది ఓట్ల రూపంలోకి మారడం లేదు. పవన్ ఏదైనా సమస్య మీద పోరాటం చేస్తే పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. అలాగే ఆయన పర్యటనల్లో వేలాది మంది జనాలు ఉంటారు. ఆయన వెనుక ఉండే జనం అంతా ఓటు వేస్తున్నారా అంటే చెప్పలేని పరిస్తితి ఉంది.

అందుకే అనుకుంటా 2019 ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండుచోట్ల ఓటమి పాలయ్యారు. అసలు పవన్ ఓడిపోతారని ప్రత్యర్ధులు సైతం ఊహించలేదు. కానీ ఆయన భీమవరం, గాజువాక ప్రాంతాల్లో ఓటమి పాలయ్యారు. ఈ రెండు ప్రాంతాల్లో పవన్ అభిమానులు, ఆయన సొంత సామాజికవర్గం ఓట్లు ఎక్కువగానే ఉన్నాయి. అయితే జగన్ వేవ్‌లో పవన్ ఓటమి పాలయ్యారు. సొంత వర్గం వారు కూడా ఓట్లు వేసినట్లు లేదు. అందుకే పవన్ ఇలా ఓటమి పాలయ్యారు.

అయితే నెక్స్ట్ ఎన్నికల్లో పవన్ పక్కాగా గెలుపు వచ్చే నియోజకవర్గంలో బరిలో దిగుతారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముందు నుంచి ఆ నియోజకవర్గాన్ని రెడీ చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాకపోతే ఆ నియోజకవర్గంలో పక్కాగా పోటీ చేస్తారా లేదా అనేది ఇప్పుడే కన్‌ఫామ్ చేయడం కష్టమే అంటున్నారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ ఉండటం వల్ల పవన్‌కు ఓటమి వచ్చింది. నెక్స్ట్ ఆ సీన్ ఉండదని గాజువాక, భీమవరంల్లో పవన్‌కు గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు.

ఇదే సమయంలో నరసాపురం అసెంబ్లీ స్థానంలో సైతం పవన్‌కు మంచి అడ్వాంటేజ్ ఉందని చెబుతున్నారు. గత ఎన్నికల్లోనే ఇక్కడ జనసేన అభ్యర్ధి స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. అప్పుడే పవన్ ఇక్కడ పోటీ చేసి ఉంటే పరిస్తితి వేరేగా ఉంటుందని అంటున్నారు. మరి చూడాలి నెక్స్ట్ ఎన్నికల్లో పవన్ గెలిచే స్థానం ఏదో.  

మరింత సమాచారం తెలుసుకోండి: