కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం పొలిటికల్ ఎంట్రీ పై చాలా కాలంగా సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయనను చేర్చుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నాయి. ముద్రగడ ను చేర్చుకోవడం ద్వారా బలమైన కాపు సామాజికవర్గం అండదండలు  ఉంటాయని అన్ని రాజకీయ పార్టీలు నమ్ముతూ ఉండడంతో, ఆయనకు డిమాండ్ ఏర్పడింది. కానీ ముద్రగడ మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు . రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు . కాపు ఉద్యమం కారణంగా అన్ని రకాలుగా నష్టపోయానని, ఇక పూర్తిగా కాపు ఉద్యమానికి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అన్ని రాజకీయ పార్టీలు ఆయనను తమ తమ పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక దశలో ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నారని హడావుడి నడిచింది. కానీ ముద్రగడ సైలెంట్ గా ఉన్నారు ఇక బిజెపిలో ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తున్నారని త్వరలోనే ఆ పార్టీలో చేరబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. అది కూడా కార్యరూపం దాల్చలేదు





. దీంతో ఆయన వ్యవహారాన్ని అందరు పక్కన పెట్టేశారు. కానీ ప్రస్తుతం బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్వయంగా తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి వెళ్లి మరి ముద్రగడ తో మంతనాలు జరపడం తో, ఇక బీజేపీలో చేరుతున్నారనే హడావుడి మళ్ళీ మొదలైంది. బిజెపి జనసేన ఎలాగు పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ముద్రగడ కూడా బీజేపీలో చేరారు కాపు సామాజికవర్గం అండదండలు పూర్తిగా బీజేపీకి ఉంటాయి అనే ఉద్దేశంతో సోము వీర్రాజు పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు అర్దం అవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: