పుట్టిన రోజు.. ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన రోజు.. అందుకే.. పుట్టిన రోజున ఆత్మీయులంతా శుభాకాంక్షలు చెబుతారు. పార్టీలు చేసుకుంటారు. ఆనందంగా గడుపుతారు. అయితే ఇంతవరకూ అయితే పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు.. కానీ.. కొందరు తమ పుట్టినరోజును ఆదర్శంగా గడుపుతారు. అనాథలు, పేదల మధ్య పుట్టిన రోజు జరుపుకుంటారు. పుట్టిన రోజును సామాజిక వేడుకగా తీర్చిదిద్దుకుంటారు.

తాజాగా.. తెలంగాణ హోంమంత్రి ముహమ్మద్ మహమూద్ అలీ అలాగే చేశారు. ఆయన తన పుట్టినరోజు సందర్భంగా అంబర్‌పేటలోని అంజుమన్ ఖాడిముల్ ముస్లి మీన్ లోని  అనాథలతో గడిపారు.  ఈ సందర్భంగా అమాయక అనాథలతో గడపడం సంతోషంగా ఉందని తెలంగాణ హోంమంత్రి ముహమ్మద్ మహమూద్ అలీ  అన్నారు.  పిల్లలతో మాట్లాడుతూ, వారి దినచర్యల గురించి తెలుసుకుని, వారు కష్టపడి చదువుకోవాలని, ఉన్నత విద్య కోసం కృషి చేయాలని అని తెలంగాణ హోంమంత్రి ముహమ్మద్ మహమూద్ అలీ  ఉద్బోధించారు.

విద్యార్తులు తమ  సందేహాలను  ఉపాధ్యాయుల నుండి తెలుసుకొని నివృత్తి చేసుకోవాలని తెలంగాణ హోంమంత్రి ముహమ్మద్ మహమూద్ అలీ సూచించారు.  విద్యార్థులు ఈ సందర్బంగా హోంమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.  అంజుమన్ ఖదిముల్ ముస్లిమీన్ కార్యకర్త  బద్రుద్దీన్  హోంమంత్రికి  సంస్థ పనితీరు మరియు విద్యార్థుల గురించి వివరించారు.  కార్యక్రమంలో  బద్రుద్దీన్ మాట్లాడుతూ  విద్యార్థులు చాలా తెలివైనవారు, కష్టపడి పనిచేసేవారు మరియు మర్యాదపూర్వకంగా ఉంటారని,  పరీక్షలు మరియు పోటీలలో బాగా రాణిస్తున్నారని తెలిపారు.

సంస్థ విద్యార్థులకు వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండటానికి ప్రభుత్వ సహకారాన్ని కొనసాగించాలని ఆయన హోంమంత్రి ముహమ్మద్ మహమూద్ అలీని అభ్యర్థించారు. దీనికి స్పందించిన హోం శాఖ మంత్రి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణ హోంమంత్రి ప్రయత్నం.. అభినందనీయం.. అయితే.. అదే సమయంలో ఆయన ఆ విద్యార్థులకు కేవలం హామీలు కాకుండా.. ఏదైనా ఆచరణాత్మకంగా సాయం చేసి ఉంటే.. ఇంకా బావుండేది. ఈ పుట్టినరోజుప్రత్యేక వేడుకకు ఓ అర్థం పరమార్థం సమకూరేది.. ఏమంటారు..?

మరింత సమాచారం తెలుసుకోండి: