కంపెనీలు పోటాపోటీగా తమ ఉద్యోగులకు బహుమతులు ఇచ్చేస్తున్నారు. తాజాగా ఇన్ఫోసిస్ కూడా హెచ్ సీఎల్ సంస్థను ఫాలో అయ్యింది. హెచ్ సీఎల్...తమ ఉద్యోగులకు మెర్సిడెజ్ కారులు ఇస్తే... ఇన్ఫీ తమ ఉద్యోగులకు ఐ ఫోన్ 6 ఎస్ ను ఇచ్చింది. అత్యుత్తమ పనితీరు కనబరిచిన టాప్-3000 ఉద్యోగులకు ఆ సంస్థ సీఈవో విశాల్ సిక్కా హాలిడే బోనస్ ఇచ్చారు. ఐఫోన్ 6ఎస్ తో పాటు ఓ ఈ మెయిల్ ను ఉద్యోగులకు పంపారు.
ఈ సందర్భంగా విశాల్ సిక్కా 'గతేడాది సంతోషకరంగా ముగిసింది. ప్రస్తుతం నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం. సంస్థ సాధించిన విజయాన్ని గుర్తించడం మాత్రమే కాదు... వేడుక చేసుకోవాల్సిన సమయం' అని అన్నారు. హాలిడే బోసన్ పై సంస్థ ఉద్యోగి హర్షం వ్యక్తం చేస్తూ ...గతంలో ఇలా బహుమతులు ఇచ్చిన సందర్భాలు లేవన్నారు. కాగా ఉన్నత పదవులతో పాటు,
భారీ ప్యాకేజీల వేతనాల కోసం సాప్ట్ వేర్ ఉద్యోగులు...ఉద్యోగాలు వీడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలు ఉద్యోగులను నిలుపుకునేందుకు గిప్ట్ లతో పాటు ఆకర్షణీయమైన ఆఫర్లు ఇవ్వటం విశేషం.
మరింత సమాచారం తెలుసుకోండి: