సాధారణంగా రాజకీయ నాయకుల మధ్య విభేదాలు అనేది వస్తూనే ఉంటాయి. అయితే కొన్ని కొన్ని సార్లు ఏకంగా సొంత పార్టీ నేతల మధ్య విభేదాలు వస్తాయి. ఆయా ప్రాంతంలో అధికారం కోసం కొంతమంది నేతలు ఇక ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటారూ.ఈ క్రమంలోనే ఇక ఆ ప్రాంతంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న కొంతమంది నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఇక రెండు వర్గాలుగా విడిపోయి ఏకంగా పార్టీకి తలనొప్పిగా మారిపోతూ ఉంటారూ. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీలోని కొంతమంది నేతలు కూడా ఇలా అంతర్గత విభేదాలతో పార్టీ అధినేతకు సరికొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నట్లు తెలుస్తుంది.



 ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక పంచాయితీ పరిష్కరించారు అన్నది ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా రామ సుబ్బారెడ్డి  సుదీర్ఘకాలంపాటు టీడీపీలో ఉన్నారు.. ఒకప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా కూడా పనిచేశారు. అలాంటి నేత గత అసెంబ్లీ ఎన్నికల సమయాల్లో వైసీపీలో చేరారు. అయితే ఇటీవలే వైసీపీలో కొత్త పంచాయతీ మొదలైంది. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కి రామసుబ్బారెడ్డి కి మధ్య ఆధిపత్యం కోసం అంతర్గత వివాదం నడుస్తున్నట్లు తెలుస్తుంది.



 అయితే ఇక వీరి మధ్య ఆధిపత్యం కోసం ప్రయత్నాలు రోజురోజుకు ఎక్కువవుతున్న తరుణంలో పార్టీకి వీరిద్దరు ఇబ్బందికరంగా మారిపోయారు. ఈ క్రమంలోనే వీరిద్దరి వెంట బెట్టుకొని ఎంపీ అవినాష్ రెడ్డి పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి దగ్గరికి తీసుకొచ్చారట. అయితే సుధీర్ రెడ్డి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థి అనే విషయాన్ని అక్కడ స్పష్టం చేసినట్లు తెలిపారు. రామసుబ్బారెడ్డి కి 2023 వ సంవత్సరంలో ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇద్దరికీ కూడా సముచిత గౌరవం ఇస్తామని సీఎం జగన్ చెప్పడంతో ఇక ఇద్దరు నేతలు కూడా అంగీకరించారు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: