వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో టీడీపీ అధినేత చంద్రబాబు కష్టపడుతున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో వచ్చిన ఘోర ఓటమి నుంచి పార్టీని బయటపడేసేందుకు బాగానే ప్రయత్నిస్తున్నారు. అయితే జగన్ బలంగా ఉండటం వల్ల ఎన్నికలై రెండేళ్ళు అయిన ఏపీలో టీడీపీ బలపడలేదు. ఇక రానున్న మూడేళ్ళలో మరింత బలపడి జగన్‌కు చెక్ పెట్టాలని బాబు చూస్తున్నారు.


అయితే జగన్‌కు చెక్ పెట్టడం బాబు ఒక్కడి వల్లే కాదని అర్ధమవుతుంది. అందుకే చంద్రబాబుకు మళ్ళీ దగ్గర జరిగే ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ సపోర్ట్ ఉంటే జగన్‌ని ఎదురుకోవచ్చని బాబు భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో పవన్ సపోర్ట్ ఇవ్వడం వల్లే టీడీపీ ఎక్కువ సీట్లు దక్కించుకుంది. అలాగే అధికారం దక్కించుకుంది. కానీ 2019 ఎన్నికల్లో పవన్ విడిగా పోటీ చేయడం వల్ల, టీడీపీకి డ్యామేజ్ జరిగింది.


జనసేన మెజారిటీ స్థానాల్లో ఓట్లు చీల్చేయడం వల్ల టీడీపీకి నష్టం జరిగింది. అదే వైసీపీకి ప్లస్ అయింది. ఇక టీడీపీకి కీలకంగా ఉన్న కృష్ణా జిల్లాలో సైతం టీడీపీ మీద జనసేన ప్రభావం పడింది. ఈ జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉన్నాయి. 16 స్థానాల్లో సగంపైనే స్థానాల్లో జనసేన ఓట్లు చీల్చి టీడీపీకి డ్యామేజ్ చేసింది. అంటే పలు నియోజకవర్గాల్లో టీడీపీ మీద వైసీపీకి వచ్చిన మెజారిటీ కంటే జనసేనకు పడిన ఓట్లే ఎక్కువ.


ఉదాహరణకు పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో వైసీపీకి వచ్చిన మెజారిటీ 5 వేలు వరకు ఉంది. కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో జనసేనకు 15 వేల ఓట్లు పైనే పడ్డాయి. అలాగే అవనిగడ్డ, కైకలూరు, విజయవాడ సెంట్రల్, వెస్ట్, పెనమలూరు లాంటి నియోజకవర్గాల్లో జనసేన ఓట్లు కంటే వైసీపీకి వచ్చిన మెజారిటీలు తక్కువే. అందుకే ఈ జిల్లాలో పవనే టీడీపీకి మైనస్ అయ్యారు. ఆ ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి పోటీ చేసి ఉంటే సగం సీట్లు అయిన గెలుచుకునేవారు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ మద్ధతు తీసుకుంటేనే వైసీపీని ఎదురుకోగలమని కృష్ణా తమ్ముళ్ళు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: