నేటి రోజుల్లో ఎవరైనా సరే ఉద్యోగానికి వెళ్లారు అంటే చాలు దాదాపు ఎనిమిది గంటల పని చేయాలి. అంతే కాదు వారానికి ఆరు రోజులపాటు పని చేయాలి.  ఇక సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే వారంలో ఐదు రోజులు పని చేస్తే ఇక వారాంతంలో రెండు రోజులు సెలవు దొరుకుతుంది. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తున్న రూల్. అయితే ఇలా ఐదు రోజుల పాటు పనిచేసే వారు ఇంకా ఎక్కువ రోజులు సెలవులు వస్తే బాగుండు అని కోరుకుంటూ ఉంటారు. అయితే ఇలా కోరుకునేవారు గట్టిగానే కోరుకుంటున్నారు. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో వారి కోరిక తీర బోయే లాగే కనిపిస్తుంది.



 వారానికి ఐదు రోజులు కాదు కేవలం నాలుగు రోజులే పనిచేయబోతున్నారు అందరు. ఏంటి నమ్మడం లేదా.. కానీ ఇది నిజమే.. ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్ కోసం ప్రస్తుతం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఉన్న సెలవుల నిబంధనలో ఎన్నో మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దేశంలో కొత్తగా కార్మిక చట్టాల ప్రకారం వారంలో కేవలం నాలుగు రోజులు పని మూడు రోజులు సెలవు దినాలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కొత్త నిబంధనల ప్రకారం కంపెనీ ఉద్యోగులు పరస్పర అంగీకారం ద్వారా ఒప్పందం చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుందట.



 అయితే నాలుగు రోజుల పనిదినాలు రాబోతున్నాయి అని సంతోష పడకండి.. ఎందుకంటే అటు షిఫ్ట్ టైమింగ్ లో మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏ జాబ్ కి వెళ్ళిన ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు పనిచేస్తున్నారు. అయితే కొత్త కార్మిక చట్టాల ప్రకారం నాలుగు రోజుల పనిదినాలు ఉంటే ఇక 8 నుంచి 9 గంటలకు కాదు ఏకంగా 12 గంటల పాటు పనివేళలు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ఎంపికను అటు కొత్త లేబర్ చట్టం లో కూడా పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఇక అంతే కాకుండా వారం మొత్తంలో 48 గంటల పనిని గరిష్ట పరిమితిగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే జరిగితే మాత్రం అటు ఉద్యోగులందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: