తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కెసిఆర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని నిప్పులు చెరిగారు. ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చే సంస్కారం లేదని మండిపడ్డారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తుందన్నారు. మునుగోడు నియోజక వర్గం అభివృద్ది పనులకు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని.. ఎన్ని సార్లు నిధులు అడిగినా... ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అన్నీ నియోజక వర్గాల పరిస్థితి ఇలానే.. తయారైందని మండిపడ్డారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ఒక సిరిసిల్లా , గజ్వేల్ మరియు సిద్దిపేట నియోజక వర్గాలకే నిధులు విడుదల చేసుకొని.. వాటిని మాత్రమే అభివృద్ది చేసుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. హుజూరాబాద్ నియోజక వర్గం లో ఉన్న అన్నీ దళిత కుటుంబాలకు.. దళిత బంధు పథకం కింద నిధులు ఇస్తున్నారని పేర్కొన్న రాజగోపాల్ రెడ్డి... ఇతర నియోజక వర్గాల్లో కేవలం 100 కుటుంబాలకే ఇస్తామనడం చాలా దుర్మార్గం అని నిప్పులు చెరిగారు. దళిత బంధు పథకం.. హుజూరాబాద్ నియోజక వర్గం ఉప ఎన్నికల కోసం తేచ్ఛ పథకమని తెలిపారు రాజగోపాల్ రెడ్డి. చిత్తశుద్ది ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాలను అభివృద్ది చేయాలని డిమాండ్ చేశారు. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం ఇక నైనా మానుకోవాలని పేర్కొన్నారు రాజగోపాల్ రెడ్డి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి