రైల్వే ప్రయాణికులకు తీపికబురు చెప్పింది దక్షిణ మధ్య రైల్వే శాఖ. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ డివిజన్‌ లోని అన్ని రైల్వే స్టేషన్లలో ఫ్లాట్‌ ఫారం టికెట్‌ ధరలను తగ్గిస్తూ... కీలక నిర్ణయం తీసుకుంది. అన్‌ రిజర్వ్‌డ్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైళ్ల పునరుద్ధరణ కారణంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకుంటునట్లు పేర్కొంది దక్షిణ మధ్య రైల్వే శాఖ. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో... ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తాత్కాలికంగా పెంచబడిన ఫ్లాట్‌ పారం టికెట్‌ ధరలను దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్‌ డివిజన్‌ లోని అన్ని స్టేషన్లలో తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో గతంలో నిలిపి వేయబడ్డ ఫ్లాట్‌ ఫారం టికెట్ల జారీ తిరిగి సికింద్రాబాద్‌ డివిజన్‌ లోని అన్ని స్టేషన్లలో ప్రారంభించన్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. జోన్‌ నెట్‌ వర్క్‌ లో అన్‌ రిజర్వ్‌డ్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లు పునరుద్ధరించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయానికి వచ్చింది దక్షిణ మధ్య రైల్వే.

ఇక కొత్త ఫ్లాట్‌ టికెట్ల ధరల విషయానికి వస్తే...
సికింద్రాబాద్‌ డివిజన్‌ లోని అన్ని రైల్వే స్టేషన్లలో అంటే నాన్‌ సబర్బన్‌ మరియు సబర్బన్‌ స్టేషన్లు అన్నింటింలోనూ.... తాజాగా తగ్గించిన ఫ్లాట్‌ పారం టికెట్‌ ధర ఇక నుంచి రూ. 10 మాత్రమే ఉండనుంది.
అలాగే.. సికింద్రాబాద్‌ మరియు హైదరాబాద్‌ స్టేషన్లలో మాత్రం ఈ ఫ్లాట్‌ పారం టికెట్‌ ధర 20 రూపాయలు ఉండనుంది. రెలు ఎక్కే మరియు దిగే సమయాల్లో ప్రయాణికులకు.. మరీ ముఖ్యంగా వృద్ధులకు మరియు దివ్యాంగులకు ఫ్లాట్‌ పారం టికెట్‌ జారీ వలన కాస్త సౌకర్యంగా ఉండనుంది. అలాగే రైల్వే స్టేషన్‌ వచ్చే వారు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. మాస్క్‌ లు తప్పనిసరి చేసింది దక్షిణ మధ్య రైల్వే . 



మరింత సమాచారం తెలుసుకోండి: