సీఐఏ శిక్షణనిచ్చి, తీర్చిదిద్దిన అఫ్గాన్ కమాండోల్లో 90శాతం మంది ఖతార్ మీదగా అగ్రరాజ్యానికి చేరుకున్నట్టు అధికారులు చెప్పారు. తాలిబన్ చెరలో ఉన్న అఫ్గాన్ గురించి వీరికి ఎన్నో విషయాలు తెలుసని, ఎన్నో కీలక సమాచారాలు వీరి వద్ద ఉందని చెప్పారు. వీరు తిరిగిరావడం అమెరికాకు సానుకూల అంశంగా ఉంటుందన్నారు. ఒకవేళ అఫ్గాన్పై అమెరికా మిలిటరీ ఆపరేషన్ చేపట్టాలంటే వీరి శక్తిసామర్థ్యాలు కీలకం అవుతాయని వివరించారు అధికారులు.
ఎప్పుడైనా, ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా మోహరించే విధంగా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి ఈ దళాలు. పంజ్షేర్లో ఎన్ఆర్ఎఫ్ (నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్) తాలిబన్లతో పోరాటం చేస్తోంది. అవసరమైతే ఈ సూపర్ కమాండోలను అమెరికా అక్కడా మోహరించవచ్చు. అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ హయాంలో అప్గనిస్తాన్ ఆర్మీని ముందుండి నడిపించి, తాలిబన్లపై పోరాడింది ఈ సూపర్ కమాండోలే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి