తెలంగాణ రాష్ట్ర సమితి పండుగ చోటు చేసుకుంటుంది పార్టీ ఏర్పాటు చేసి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఘనంగా ప్లీనరీ నిర్వహిస్తోంది. హైదరాబాదులో   గులాబీ పండుగ గుబాళించపోతుంది. ఉదయం 11: 30 నిమిషాలకు టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం జరగనుంది. హైటెక్ సిటీలోని హెఐసిసి  లో ఘనంగా జరిగే ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈమేరకు భాగ్యనగరం మొత్తం గులాబీ మయంగా మారిపోయింది. హైటెక్స్ కు వెళ్లే దారులన్నీ పార్టీ నేతల కటౌట్లతో స్వాగతం పలుకుతున్నాయి. మూడేళ్ల తర్వాత జరుగుతున్న పార్టీ పండుగ కోసం ధూమ్ ధామ్ గా ఏర్పాటు చేశారు.

 ప్లీనరీకి ఆరు వేల మందికి పైగా టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. ముందుగా కెసిఆర్ టిఆర్ఎస్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి మాధిరి శ్రీనివాస్ రెడ్డి ప్రకటిస్తారు. ఆ తర్వాత నూతన అధ్యక్షుడు ఉపన్యాసం ఉంటుంది. ప్లీనరీ సమావేశంలో మొత్తం ఏడు తీర్మానాలను ఆమోదించనున్నారు.  ప్లీనరీ కోసం ప్రత్యేకంగా సాంగు ని కూడా రూపొందించారు. వేలాది ఫోటోలతో  సీఎం కేసీఆర్ హిస్టరీ ప్రదర్శిస్తారు. అయితే హెచ్ ఐ సీసీ ప్రాంగణంలో ఏకంగా 50 ఎకరాలు కేటాయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాహనాలు ఒకపక్క, కార్యకర్తల వాహనాలకు మరొకచోట  పార్కింగ్ సౌకర్యం కల్పించారు. అలాగే హైటెక్స్ పరిసరాల్లో  పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. ప్రతినిధుల నమోదు అనంతరం లోపలికి వెళ్లేందుకు వాళ్ళకి ఒక కకిట్ ఇస్తున్నారు. ఈరోజు ఏ ఏ కార్యక్రమాలు ఉంటాయి, షెడ్యూల్ ఎలా ఉంటుందన్న అంశంపై  ఒక నివేదిక రూపంలో కార్యకర్తలకు అందిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇక్కడ కార్యక్రమాలు కూడా జరుగుతాయి.

 ఏఏ తీర్మానాలపై ఎవరెవరు ప్రసంగించాలన్న  అంశం కూడా పార్టీ ఇప్పటికే ఖరారు చేసింది. మొత్తానికి చూసినట్లయితే పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తోంది. పార్టీ క్యాడర్ ఇకపై ప్రజల్లోకి వెళ్లేందుకు ఎలా వ్యవహరించాలి, పార్టీ క్యాడర్ బాధ్యత ఏంటి అనేది సీఎం కేసీఆర్ నేతలకు వివరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6500 మంది అంటే ముఖ్య నేతలకు మాత్రమే ఈ ప్లీనరీకి ఆహ్వానం ఉంది. ఆహ్వానం అందిన నేతలు మాత్రమే ఈ ప్లీనరీకి రావాల్సి ఉంది. మిగతా వాళ్లకు ఈ ప్లీనరీ  కి అనుమతి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: