భారత్-చైనా సరిహద్దులలో పరిస్థితులు రోజురోజుకు శృతిమించుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మీడియా దీనిపై దృష్టి బాగా పెడుతుంది. రెండు దేశాల సరిహద్దులలో ఆయా దేశాలు 50వేల పైనే సైన్యాన్ని మోహరించాయి. మరోవైపు భారత్ యుద్ధ ట్యాంకులను కూడా అక్కడకు చేర్చిపెట్టింది. 70వేల సైన్యాన్ని సిద్ధం చేసింది. అనేక అత్యాదునిక ఆయుధాల తో ప్రాథమిక పరీక్షలు కూడా భీకరంగా చేస్తుంది. ఇవన్నీ సరిహద్దులలోనే ఆయా ఆయుధ సామాగ్రి తరలించిన తరువాత చేస్తుంది భారత్. చైనా కూడా దాదాపుగా 50వేల సైన్యాన్ని సరిహద్దులలో చేర్చి పెట్టింది. ఈ పరిస్థితులు దాదాపు యుద్ధ వాతావరణాన్ని మరిపిస్తున్నాయి. అలాగే భారత సముద్ర తీరప్రాంతాలలో కూడా హై అలర్ట్ ను ప్రకటించబడింది. యుద్ధ విమానాలను కూడా ఆయా ప్రాంతాలనుండి ప్రయాణించేందుకు ఇప్పటికే సిద్ధం చేసుకుని ఉన్నారు.

భారత్ ఎటువంటి చైనా వ్యూహాన్నైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉందని అంతర్జాతీయ మీడియా కూడా వ్యాఖ్యానించింది. భారత యుద్ధ ట్యాంకులు కూడా తవాంగ్ లో మిస్సైల్ పరీక్షలు చేశారు. పెద్ద ఎత్తున సైన్యం ఎల్ఓసి వద్ద ఉన్న బంకర్లలో యుద్దానికి సిద్ధంగా ఉన్నారు. ఆయా పర్వతాలపై కూడా భారత సైన్యం సిద్ధంగా ఉంది, అక్కడ నుండి అనుక్షణం శత్రువు జాడలను కనిపెడుతున్నారు. ప్రస్తుతం అక్కడ సైన్యానికి తీవ్రమైన తర్ఫీదు పొందుతున్నారు. ఎప్పుడు యుద్ధం వచ్చినా భారత సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు ఆయా అధికారులు.

ఒకవైపు ఆర్మీ, మరోవైపు నేవీ, ఇంకోవైపు ఎయిర్ ఫోర్స్ సంబందించిన సైన్యం సరిహద్దులలో యుద్దానికి ముందు చేయాల్సిన ప్రాథమిక పరీక్షలు, తర్ఫీదులు పొందుతున్నారు. దాదాపుగా యుద్ధ సన్నివేశాలు చూస్తున్నట్టే ఉందని అంతర్జాతీయ మీడియా దీనిపై కధనం రాసింది. ఈ పరిస్థితులు చూస్తున్న ప్రపంచం కూడా చైనా-భారత్ యుద్ధం అనివార్యం అన్నట్టే భావించినప్పటికీ, ఆఖరి క్షణం వరకు భారత్ శాంతి కోసమే ప్రయత్నిస్తుంది అనేది వారికీ  తెలిసిన నిజం. అందుకు ప్రపంచ దేశాలు కూడా ఇరు దేశాలతో చర్చించి శాంతిని నెలకొల్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విధమైన చొరవ ప్రపంచ స్థాయి సంస్థలు చేయాల్సి ఉంది. అప్పుడే ఇలాంటి వేడి పరిస్థితులు మరోసారి రాకుండా సుస్థిర శాంతి వైపు అడుగులు వేయగలం. ప్రస్తుత పరిస్థితి మాత్రం ఇప్పుడో ఇంకాసేపో యుద్ధం అన్నట్టే ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: