కేసీఆర్ బీజేపీపై ఫైర్ అయ్యారు, అయితే తాజా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ని మాత్రం ఆయన వదిలేశారు. ఆయనంటే అభిమానంతో పాదు, ఆయనపై ఉన్న ఇగో వల్లే ఈటల పేరు కేసీఆర్ ఎత్తలేదని అంటున్నారు. అవును, పార్టీనుంచి బయటకి పంపించేసిన తర్వాత ఉప ఎన్నికల సమయంలో కూడా నేరుగా ఈటల పేరు ప్రస్తావిస్తూ విమర్శలు చేయలేదు కేసీఆర్. ఇప్పుడు కూడా ఆయన అదే పంథాలో ఉన్నారు.

తెలంగాణా సీఎం కేసీఆర్, కేంద్ర ప్రభుత్వంపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఉతికి ఆరేశారు. ధాన్యం సేకరణపై కేంద్రం వైఖరి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని.. అందుకోసం పోరాడతానని చెప్పారు. అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేస్తానంటూ హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ ధరలపై సెస్ విరమించుకోవాలని అన్నారు. తెలంగాణా హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం పోరాడుతూనే ఉంటానని క్లారిటీగా తేల్చిచెప్పారు కేసీఆర్. బీజేపీ నేతలు తనపై చేస్తున్న వ్యాఖ్యలపైనా కేసీఆర్ ఘాటుగానే స్పందించారు.

బీజేపీ నేతలు తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నా ఇన్నాళ్లూ.. సహించానని.. ఇక ఓపిక పట్టేది లేదని తెగేసి చెప్పారు. తెలంగాణ సీఎంను జైలుకు పంపుతామని అంటున్నారని.. అది బీజేపీ నేతలకు సాధ్యం కాదని అన్నారు. తనను టచ్ చేసి చూస్తే.. తెలుస్తుందని, అంత అహంకారంతో మాట్లాడతారా అంటూ బీజేపీ నేతలను ఉద్దేశించి అన్నారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు కేసీఆర్. ప్రసంగం అంతా బీజేపీని టార్గెట్ చేస్తూ సాగినా, ఎక్కడా ఈటల పేరు కూడా ఎత్తలేదు. హుజూరాబాద్ ఫలితాలపైనా ఒకేముక్కలో తేల్చేశారు. కనీసం గెలిచిన ఈటల పేరును కూడా ప్రస్తావించలేదు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ ఇలాగే వ్యవహరించాడు. తన పార్టీని గెలిపించాలని మాట్లాడటం తప్పించి.. ఈటల పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడటం లేదు. పార్టీ నుంచి ఈటలను బహిష్కరించిన అనంతరం, ఆయన కేసీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కేసీఆర్ ను తీవ్రంగా బాధించాయట.. అందుకే టీఆర్ఎస్ లో తనను ఎదిరిస్తే ఎలా ఉంటుందో కేసీఆర్ మరోసారి చూపించాడట. పార్టీలో ఎవరైనా సరే తనను ధిక్కరిస్తే ఇలాగే ఉంటుందనే సంకేతాలను పార్టీ నేతల్లోకి పంపించారు. గతంలో డీఎస్, విజయ శాంతి విషయంలోనూ కేసీఆర్ ఇదే ఫార్ములాను ప్రయోగించారు. పార్టీ నుంచి వెళ్ళిపోయిన వారి పేరు కూడా ఎత్తకుండా వారిని అలాగే వదిలేశారు కేసీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: