ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన‌లోకి చేరిక‌లు పెరుగుతాయా? ఆ పార్టీకి మెరుగైన ప్రాతి నిధ్యం ల‌భిస్తుందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీలకులు. రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు మారు తున్నాయ‌ని చెబుతున్నారు. గ‌త 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఘోర ప‌రాజ‌యం చ‌వి చూసింది. పార్టీ అధినేత ప‌వ‌న్ కూడా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. దీనికి జ‌గ‌న్ సునామీనే కార‌ణ‌మ‌ని అప్ప‌ట్లో అంచ‌నా వేశారు. జ‌గ‌న్ ఎన్నో ఆశ‌లు పెట్టుకుని.. ప్ర‌జ‌లు ఆయ‌నను గెలిపించార‌ని.. ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. అయితే.. పాల‌న రెండున్న‌రేళ్లు గ‌డిచినా.. ఆశించిన స్థాయిలో జ‌గ‌న్ దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేక పోవ‌డంతో ఇప్పుడు ఇత‌ర పార్టీలవైపు ప్ర‌జ‌లు మొగ్గు చూపుతున్నారు.

ఈ ప‌రిణామ‌మే జ‌న‌సేన‌కు క‌లిసి వ‌స్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా జ‌రిగిన‌.. మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అభ్య‌ర్థులు ప‌లువార్డుల్లో గెలుపు గుర్రం ఎక్కారు. ఏకంగా మునిసిపాలిటీలు ల‌భించే ప‌రిస్థితి లేక‌పోయినా.. ఆశాజ‌న‌క‌మైన ఫ‌లితాల‌ను రాబ‌ట్టారు. ఇది పార్టీకి బూస్ట్ ఇస్తోంది. ముఖ్యంగా కాపులు ఎక్కువ‌గా జిల్లాల్లో ఫ‌లితం బాగుంది. అదేస‌మ‌యంలో ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లోనూ.. జ‌న‌సేన దూకుడు క‌నిపించింది. ఊహించ‌ని విధంగా.. ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో జ‌న‌సైనికులు విజ‌యం ద‌క్కించు కున్నారు.

దీంతో జ‌న‌సేన‌పై ఆశ‌లు పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలో పార్టీలో చేరిక‌లు కూడా పెరుగుతు న్నాయ‌ని.. అంటున్నారు ఆ పార్టీ నాయ‌కులు. ప‌వ‌న్‌పై ప్ర‌జ‌ల అభిప్రాయం కూడా మారుతోంద‌ని చెబుతున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాల కోసం ఎదురు చూస్తున్న‌ప్ర‌జ‌ల‌కు ఇప్పుడు జ‌న‌సేన ఒక చుక్కానిగా మారింది. అటు అధికార పార్టీ.. వైసీపీ ఇటు విప‌క్షం టీడీపీల‌కు డిస్టెన్స్ మెయింటెన్ చేసే వారు.. జ‌న‌సేన వైపు మొగ్గు చూపుతు న్నారు. గత సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పోల్చుకుంటే.. జ‌న‌సేన ఓటు బ్యాంకు కూడా పెరిగింది.

ప‌లు చోట్ల అభ్య‌ర్థులు ఓడిపోయినా.. గౌర‌వ ప్ర‌ద‌మైన ఓటు బ్యాంకు వ‌చ్చింది. ఇది మున్ముందుకు పెంచుకునేందు కు అవ‌కాశం కూడా ఉంద‌ని.. ప‌రిశీల‌కులు అంటున్నారు. ఈ నేప‌థ్యంలో రాబోయే రోజుల్లో జ‌న‌సేన‌లోకి చేరిక‌లు పెర‌గ‌డంతోపాటు.. ప్ర‌జ‌లు కూడా ఈ పార్టీవైపు మొగ్గు చూప‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: