ఏ రాష్ట్ర ప్రభుత్వామైనా సరే అభివృద్ధి చేసి ఆదాయం సృష్టించి...ప్రజలకు కావల్సిన పనులు చేయాలి, పథకాలు ఇవ్వాలి. కానీ ఏపీలో జగన్ ప్రభుత్వం మాత్రం దీనికి కాస్త విరుద్ధంగానే వెళుతున్నట్లు కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వం వచ్చి రెండున్నర ఏళ్ళు అవుతుంది...మరి ఈ రెండున్నర ఏళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటి...ఆ అభివృద్ధి ద్వారా రాష్ట్రానికి ఎంత ఆదాయం తీసుకొచ్చిందని అడిగితే...అంటే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా? అనే డౌట్ సామాన్య ప్రజలకు కూడా రావొచ్చు.

ఎందుకంటే ఈ రెండున్నర ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి తక్కువే అని చెప్పాలి. మరి అభివృద్ధి జరగకపోతే ఆదాయం ఉండదు..ఆదాయం లేకపోతే పథకాల అమలు జరగదు. మరి అలాంటప్పుడు జగన్ ప్రభుత్వం సమయానికి పథకాలు ఎలా ఇస్తుంది? అంటే దానికి అనేక మార్గాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. అప్పులు, పన్నులు ఇవే జగన్ ప్రభుత్వం ఆదాయ మార్గాలు. దొరికినంత అప్పు చేసి పథకాల రూపంలో ప్రజలకు పంచడం...అలాగే అడ్డుఅదుపు లేకుండా పన్నులు పెంచేసి...పథకాల రూపంలో ఇచ్చిన డబ్బులని వెనక్కి తీసేసుకోవడం.

ఈ విషయంలో వాస్తవం ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. జగన్ ప్రభుత్వం వచ్చాక ఎన్ని రకరకలుగా ధరలు, పన్నులు పెంచి ప్రజలపై భారం పెంచారో తెలిసిందే. ఇసుక, మధ్యం ధరల పెంపు విషయంలో లిమిట్ లేదు. అలాగే కరెంట్ ఛార్జీలు, ఆర్‌టి‌సి చార్జీలపై బాదుడు ఏ విధంగా ఉందో తెలిసిందే. అలాగే పెట్రోల్, డీజిల్ రేట్లపై పన్నుని శాతాల రూపంలో పెంచి...ప్రజలని మాయ చేసిన విషయం తెలిసిందే. అంటే వ్యాట్‌ని శాతాల రూపంలో పెంచడం వల్ల పెట్రోల్, డీజిల్ మూల ధర పెరిగినప్పుడల్లా.. వ్యాట్ కూడా పెరుగుతుంది. అలాగే రోడ్డు సెస్ అంటే ఒక రూపాయి వసూలు చేస్తున్నారు. చెత్తపై పన్ను, ఇంటి పన్నులు పెంచారు.

తాజాగా కొత్త వాహ‌నాల లైఫ్‌టాక్స్, గ్రీన్‌టాక్స్ పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. కొత్త వాహ‌నాల రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో 13, 14, 17, 18 శాతం చొప్పున లైఫ్ టాక్స్ విధించేందుకు జగన్ ప్రభుత్వం రెడీ అయింది. అలాగే గ్రీన్ ట్యాక్స్ కూడా పెంచనుంది. అంటే ఇవి ఏంటి అనేది సామాన్య ప్రజలకు అవగాహన లేకపోయినా సరే...వీటి వల్ల వాహనాల ధరలు మాత్రం పెరగనున్నాయని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: